
తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ కేసు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం జైభీమ్ (Jai Bhim) . సూర్య (Suriya) లాయర్‌గా నటిస్తూ.. హోం ప్రొడక్షన్స్ 2డీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించాడు. కే మణికందన్, లిజొమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. డైరెక్టర్ జ్ఞానవేల్ (T. J. Gnanavel) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని అందుకుంది.
ఏటా నిర్వహించే ప్రఖ్యాత (Golden Globe Awards) గోల్డెన్ గ్లోబ్స్-2022 నామినేషన్స్ లో Best Non-English Language Film కేటగిరీలో చోటు సంపాదించింది. అంతేకాదు రికార్డు హిట్‌గా నిలిచిన హాలీవుడ్ సినిమాలు The Shawshank Redemption, The Godfather ఐఎండీబీ రేటింగ్‌ను అధిగమించిన చిత్రంగా అరుదైన ఘనత సాధించింది.
జైభీమ్ (Jai Bhim) చిత్రంలో వన్నియార్ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కొన్ని అభ్యంతరక సన్నివేశాలను తొలగించాలని పీఎంకే (PMK Leaders) పార్టీ డిమాండ్ చేయగా..వారికి జ్ఞానవేల్ క్షమాపణలు కూడా చెప్పారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, దళితులపై దాడులను చూపించే ప్రయత్నమే జైభీమ్ చిత్రం అని జ్ఞానవేల్ తెలిపారు. మరోవైపు సూర్యకు బెదిరింపు కాల్స్ రావడంతో చెన్నై టీ నగర్‌లోని సూర్య నివాసం వద్ద భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు