e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News RRR విడుదలకు ఇప్పుడు అదొక్కటే అడ్డు

RRR విడుదలకు ఇప్పుడు అదొక్కటే అడ్డు

RRR విడుదలకు ఇప్పుడు అదొక్కటే అడ్డు

అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. ఆరు నూరైనా అనుకున్నట్లుగానే అక్టోబర్ 13 ట్రిపుల్‌ ఆర్ సినిమాను విడుదల చేస్తామని మరోసారి కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం అటు నందమూరి, ఇటు మెగా అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. ఉన్నట్టుండి కరోనా వైరస్ విజృంభించడంతో కనీసం 2021లో అయినా ట్రిపుల్ ఆర్‌ సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. కానీ అందరి అనుమానాలకు తెరదించుతూ కచ్చితంగా అక్టోబర్ 13న‌ దసరా పండగ బరిలో తన సినిమాను విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు.

ఇప్ప‌టికే ట్రిపుల్ ఆర్‌ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతో పాటు మరికొన్ని చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. వీటన్నింటిని సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. నెల రోజుల పాటు పూర్తిగా ప్రమోషన్‌కే కేటాయించనున్నాడు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ ఒక్క విషయంలో మాత్రం ట్రిపుల్ ఆర్ దర్శక నిర్మాతలతో పాటు.. అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఆ ఒక్క విషయంలో తేడా కొడితే సినిమా మళ్లీ ఈ ఏడాది రానట్లే. అంతగా భయపెడుతున్న అంశం ఏంటో అందరికీ తెలుసు. కరోనా వైరస్ మూడో దశ.. అవును థర్డ్ వేవ్ మొదలవుతుంది అంటూ ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సెప్టెంబ‌ర్‌లోనే థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. ఇలాంటి సమయంలో అక్టోబర్ 13న విడుదల కానుంది. పరిస్థితులు మరోసారి చేదాటిపోతే సినిమా వాయిదా వేసుకోవడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. అయితే అలాంటిదేమీ జరగదులే అని తమకు తామే ధైర్యం చెప్పుకుంటున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి చూడాలి.. వైరస్ అనే అడ్డు లేకపోతే సినిమా ఎలాంటి సమస్య లేకుండా విడుదల అవుతుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

తెలుగు ఇండస్ట్రీకి మరో తమిళ హీరో.. 20 కోట్ల రెమ్యున‌రేష‌న్‌

Tollywood : అంద‌రి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇత‌ర భాష‌ల హీరోలు

థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లో రాశీఖ‌న్నా..?

Bigg boss | బిగ్ బాస్ అప్‌డేట్‌.. కంటెస్టెంట్స్ వీళ్ళేనా ?

ఒకే ఒక్కడు రేంజ్‌లో చ‌రణ్‌-శంక‌ర్ మూవీ..!

ప్ర‌కాశ్ రాజ్‌కు విజ‌న్ ఉంది,అందుకే స‌పోర్ట్ చేస్తున్నాను: నాగ‌బాబు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
RRR విడుదలకు ఇప్పుడు అదొక్కటే అడ్డు
RRR విడుదలకు ఇప్పుడు అదొక్కటే అడ్డు
RRR విడుదలకు ఇప్పుడు అదొక్కటే అడ్డు

ట్రెండింగ్‌

Advertisement