బిగ్ బాస్ 5 ( Bigg Boss) తెలుగు ఇంకా మొదలు కాకముందే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానికంటే కూడా అందులో ఎవరెవరు పాల్గొంటున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. బయట పరిస్థితుల నేపథ్యంలో కేవలం డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆధారంగానే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేస్తున్నారు. ఆగష్టు మొదటి వారంలో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరు ఎవరు పాల్గొనబోతున్నారు.. ఎవరికి అవకాశం దక్కనుంది అనేది సోషల్ మీడియాలో ఒక లిస్టు బాగా వైరల్ అవుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కేవలం సోషల్ మీడియాలో తిరుగుతున్న లిస్టు మాత్రమే. మరి వాళ్ళు ఎవరు అనేది చూద్దాం..