ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 18, 2020 , 16:49:52

నేను పొగ తాగ‌ను: ర‌కుల్ ప్రీత్ సింగ్‌

నేను పొగ తాగ‌ను: ర‌కుల్ ప్రీత్ సింగ్‌

మాదక ద్రవ్యాల కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ టాలీవుడ్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. తాను ఫిట్ నెస్ ను ఫాలో అవుతాన‌ని, ప్ర‌తీ రోజు యోగ సాధ‌న చేస్తూ..ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని అనుస‌రిస్తాన‌ని పిటిష‌న్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. అంతేకాదు తాను పొగ‌తాగ‌న‌ని కూడా స్ప‌ష్టం చేసింది. డ్ర‌గ్స్ వాడే వారి జాబితాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్న‌ట్టు రియా చ‌క్ర‌వ‌ర్తి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు తెలిపింద‌ని నేష‌న‌ల్ మీడియాలో క‌థ‌నాలు రావ‌డంతో ర‌కుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది.

జస్టిస్‌ నవీన్‌ చావ్లా ధర్మాసనం ర‌కుల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. మీడియాలో ప్రసారాలపై సుప్రీం కోర్టు స్పందించిందని  ధ‌ర్మాస‌నం పేర్కొంది. మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పిందని జస్టిస్‌ నవీన్‌ చావ్లా వ్యాఖ్యానించారు. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని సమాచార, ప్రసారశాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌కౌన్సిల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే స్వీయ నియంత్రణ పాటించాలని హైకోర్టు మీడియా సంస్థలకు సూచించింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.