ఆది, రాజ్ తరుణ్ లకు ఆఫర్స్ ఎలా వస్తున్నాయ్
ఆది, రాజ్ తరుణ్ | స్టార్ హీరోలకు ఎన్ని ఫ్లాపులు వచ్చినా పర్లేదు కానీ చిన్న హీరోలకు మాత్రం ఒక్క ఫ్లాప్ వచ్చినా హీరోల పొజిషన్ గల్లంతైపోతుంది.

స్టార్ హీరోలకు ఎన్ని ఫ్లాపులు వచ్చినా పర్లేదు కానీ చిన్న హీరోలకు మాత్రం ఒక్క ఫ్లాప్ వచ్చినా పొజిషన్ గల్లంతైపోతుంది. మళ్లీ వాళ్లకు ఆఫర్లు రావాలంటే కష్టపడాల్సిందే. అందులోనూ మార్కెట్ పెద్దగా లేని హీరోలకు వరసగా ఫ్లాపులు వస్తే ఇక వాళ్లను మరిచిపోవాల్సిందే. కానీ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు మాత్రం ఎన్ని ఫ్లాపులు వస్తున్నా అవకాశాలు మాత్రం అందుకుంటూనే ఉన్నారు. వాళ్లే ఆది, రాజ్ తరుణ్. ఒకరికి వరసగా 12 ఫ్లాపులు ఉంటే.. మరొకరికి 10 ఫ్లాపులు వరసగా ఉన్నాయి. అయినా కూడా ఇద్దరి చేతిలో వరస సినిమాలు ఉన్నాయి. ఆది నటించిన శశి ఈ మధ్యే విడుదలైంది. దీనికి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. మరోవైపు రాజ్ తరుణ్ పవర్ ప్లే సినిమాకు కూడా కలెక్షన్స్ రాలేదు. కానీ ఈ ఇద్దరు హీరోలు మాత్రం సినిమాలు చేస్తూనే ఉన్నారు.
ఇంత జరిగినా.. ఇన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఈ హీరోలపై దర్శక నిర్మాతలు నమ్మకం పెట్టుకుంటున్నారు. వాళ్లతో సినిమాలు చేస్తున్నారు. దానికి కారణం వాళ్లలో టాలెంట్ ఉంది.. దాంతో పాటు కలెక్షన్స్ రూపంలో కాకపోయినా మరోలా బిజినెస్ జరుగుతుండటమే.
కావాలంటే ఇప్పుడు ఆదినే తీసుకోండి. ఈయన డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడు. డైలాగులు అద్భుతంగా చెప్తుంటాడు. నటుడిగా కూడా పర్లేదు. ఈయనతో సినిమా చేస్తే డబ్బింగ్ రైట్స్ రూపంలోనే దాదాపు రూ.5 కోట్ల వరకు వస్తాయని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇక థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపి మరో 5 కోట్ల వరకు వస్తున్నాయని తెలుస్తుంది.
అంటే ఆదితో సినిమాను రూ.4 కోట్లలో పూర్తి చేసినా కూడా వాళ్లకు నికరంగా రూ.6 కోట్ల వరకు లాభాలు వస్తున్నాయి.
మరోవైపు రాజ్ తరుణ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయనతో సినిమా చేస్తే కూడా డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ.4 కోట్లకు పైగానే వస్తున్నాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 6 కోట్ల వరకు వస్తున్నాయి. అంటే ఆది, రాజ్ తరుణ్ లతో సినిమాలు చేస్తే కనీసం రూ.5 కోట్లకు పైగా లాభాలు వస్తున్నాయి. అందుకే ఈ హీరోలకు ఇన్ని ఫ్లాపులు వచ్చినా కూడా సినిమాలు చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ మూడు సినిమాలతో.. ఆది రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
థియేటర్స్ మూసివేయం : మంత్రి తలసాని
రవితేజ: ముగ్గురు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్
పవన్ సినిమాతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి విజయదేవరకొండ
సీక్రెట్ ప్లేస్‌లో సారా..ట్రెండింగ్‌లో స్టిల్స్
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
మహేశ్‌బాబు తండ్రిగా మలయాళ నటుడు..?
జనాల్లేక థియేటర్స్ మూసుకుంటున్న యాజమాన్యం
వర్షంలో చైతూ, సాయిపల్లవి డ్యాన్స్
నిన్ను మించిన వాళ్లు లేరు.. కంగనపై సమంత ప్రశంసల వర్షం
థాయ్‌లాండ్ ఫారెస్ట్‌లో 15 రోజులున్నా: రానా
కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య ఏం చేస్తుంది?
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

