సినిమాల్లో కనిపించేది పక్కింటి కుర్రాడేనా అన్నంత సహజసిద్దంగా నటిస్తూ న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని (Nani). ఈ సెల్ఫ్‌మేడ్ యాక్టర్‌కు అభిమానులు, ఫాలోవర్ల సంఖ్య ఎక్కువే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.తన సినిమాలకు ఎంత ప్రాధాన్యమిస్తాడో.. అభిమానుల విషయంలో అంతే శ్రద్ద చూపిస్తుంటాడు నాని. హైదరాబాద్‌లోని కన్వెన్షన్ సెంటర్ (Hyderabad Convention Center)లో ఇవాళ ఉదయం అభిమానుల (Nani Fans) కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు నాని.
తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 4వేల మంది అభిమానులు తమ ఫేవరేట్ స్టార్ నానిని కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. అభిమానులందరినీ పేరు పేరున పలుకరిస్తూ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నాడు నాని. అందరికి స్వయంగా ఆహారం వడ్డించాడు. తనతో ఫొటోలు దిగాలనుకునే వారికి సమయం కేటాయించాడు. అంతేకాదు సమావేశానికి వచ్చిన అభిమానులకు శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) నుంచి ఆటోగ్రాఫ్ ఫొటో ప్రింట్ ఉన్న బ్యాగ్స్ ను కానుకగా అందించాడు.
తాము ఎంతగానో ఇష్టపడే అభిమాన హీరో ఇలా అందరినీ పిలిపించి కడుపునిండా భోజనం పెట్టి..మంచి చెడ్డలను అడిగి తెలుసుకోవడమే కాకుండా కానుకలను అందించిన నాని గొప్ప మానవతా హృదయానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నాని ఇలా ప్రత్యేకంగా తమను పిలిపించుకోవడంతో ఆనందంలో ఎక్జయిటింగ్ లోనవుతున్నారు ఫ్యాన్స్.
ఇది కూడా చూడండి
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్