Chief Selector : భారత పురుషుల సీనియర్ జట్టు ఛీప్ సెలెక్టర్ రేసు ఆసక్తి రేపుతోంది. ఈమధ్యే అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం ముగియడంతో అతడి స్థానంలో ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. అయితే.. ఈ ప్రశ్నకు సమాధానం దాదాపు దొరికేసింది అనిపిస్తోంది. పలువురు మాజీ ఆటగాళ్లు పోటీలో ఉన్నప్పటికీ మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా (Pragyan Ojha) అందరికంటే ముందున్నాడు. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో సభ్యుడైన ఓఝా తాత్కాలికంగా చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు చేపట్టినా.. అతడు పూర్తి స్థాయిలో సేవలందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే.. అగార్కర్ వారసుడిగా అతడు సరైన, సమర్ధుడైన వ్యక్తి అని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టీ20లకు స్క్వాడ్ ప్రకటన అనంతరం.. అజిత్ అగార్కర్ స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌పై స్పష్పత వస్తుందని అంతా ఊహించారు. ముంబైలో జరిగిన 95వ బోర్డు వార్షిక సమావేశంలో అగార్కర్ గురించి ఓ నిర్ణయానికి రావాలని సభ్యులకు బీసీసీఐ సూచించింది కూడా. తన కాంట్రాక్ట్‌ను పొడిగించాలని అతడు సైతం బీసీసీఐని కోరలేదు. దాంతో.. తదుపరి చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ ఆటగాళ్లు పార్థీవ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝాలు ఉన్నారనే వార్తలు వినిపించాయి.
🚨 Pragyan Ojha roped in as interim chairman of selectors!
In a selection committee meeting in Guwahati today, Ajit Agarkar was absent and Ojha took charge of it as the senior-most selector (based on the number of Tests played) https://t.co/zTRMt1YtLm
— Cricbuzz (@cricbuzz) September 29, 2026
అయితే.. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో సభ్యుడైన ఓఝాకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపిక పూర్తయ్యేంత వరకూ అతడు కొనసాగుతాడని భారత బోర్డు పేర్కొంది. కానీ, ఓఝా పూర్తి స్థాయిలో చీఫ్ సెలెక్టర్ పదవి చేపట్టే అవకాశాలున్నాయి. ‘బీసీసీఐలో ఏదైనా జరగొచ్చు. చూస్తుంటే ఓఝాకు అందరూ అమోదం చెబుతారని అనిపిస్తోంది’ అని మంగళవారం బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
చీఫ్ సెలెక్టర్ రేసులో ఓఝా అందరికంటే ముందుండడానికి ఓ కారణముంది. ప్రస్తుత సెలక్షన్ సభ్యుల్లోని అందరికంటే అతడు ఎక్కువ (24) టెస్టులు ఆడాడు. శివ సుందర్ దాస్ 23, ఆర్పీ సింగ్ 14, అజయ్ రత్రా ఆరు టెస్టులు మాత్రమే ఆడారు. మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ పేరు వినిపించినా ఓఝాకే ఎక్కువ మద్దతు లభించేలా ఉంది. అలాఅనీ.. అతడి పేరును బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు. అక్టోబర్ రెండో వారంలో.. న్యూజిలాండ్‌తో వన్డే, టీ20లకు స్క్వాడ్ ప్రకటనలోపు లేదంటే తర్వాతైన అజిత్ అగార్కర్ వారసుడు ఎవరు? అనేది తేలిపోనుంది. సెప్టెంబర్ 26న మధ్యంతర చీఫ్ సెలెక్టర్‌గా ఓఝా నియమితుడైన విషయం తెలిసిందే.
#PragyanOjha To Lead Selection Meeting As #India Set To Pick Squads For #NewZealand Tour This Week
#BCCI #IndianCricketTeam
https://t.co/kJJ1ndZMhH
— News18 CricketNext (@cricketnext) October 5, 2026