The Traitors Telugu | టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా పరిచయమవుతున్న రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’. ఈ షో ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా విడుదల చేసింది. రహస్య గుర్తింపులు, మారుతున్న విధేయతలు మరియు వ్యూహాత్మక అడుగుల నేపథ్యంలో సాగే ఈ క్రూరమైన గేమ్ షోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ షోతో తేజ సజ్జా తొలిసారిగా రియాలిటీ షో హోస్ట్‌గా అడుగుపెడుతుండగా, మొత్తం 10 ఎపిసోడ్లతో తెరకెక్కిన ఈ సిరీస్ అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ షోలో భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన 20 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఇందులో సింగర్ చిన్మయి శ్రీపాద, నటులు హర్షవర్ధన్, ప్రగతి మహావది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యుత్ రామన్, విష్ణు ఒయ్, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీష చౌదరి, స్వీకర్ అగస్తతి, ఆషిక పదుకొనే, వర్ష డిసౌజా, ప్రణవ్ అకా అభినవకవి, ఎస్ఎస్ వర్ధన్, రాహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనుంజయ్ మరియు ఫాల్గుణి బండేరా తదితరులు పోటీపడుతున్నారు. ఇందులో ఇన్నోసెంట్ (నిర్దోషులు) ప్లేయర్స్ అందరూ కలిసి తమలో ఉన్న ‘ట్రైటర్స్’ (మోసగాళ్లు) ఎవరనేది కనిపెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ట్రైటర్స్ ఎవరికీ చిక్కకుండా రహస్యంగా ఆటను సాగించాలి. “మోసం ఇక్కడ న్యు రూల్” అంటూ సాగే ఈ హై-వోల్టేజ్ సర్వైవల్ గేమ్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పంచడానికి సిద్ధమవుతోంది.