బాలీవుడ్ యాక్టర్ షారుక్‌ఖాన్ తన ట్విటర్ ఖాతాలో చాలా అరుదుగా ట్వీట్లు పెడుతుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ సారి ఎవరూ ఊహించని విధంగా ట్విటర్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ తో నెటిజన్ల ముందుకొచ్చాడు బాలీవుడ్ బాద్షా. తమ అభిమాన హీరో ఇలా సడెన్‌గా సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చేసరికి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు.
ఫ్యాన్స్ దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా షారుక్ ను అండర్ వేర్ కలర్ నుంచి నెక్ట్స్ సినిమా రిలీజ్ వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. షారుక్ కూడా చాలా వేగంగా వాటికి రిప్లై ఇచ్చాడు. అండర్ వేర్ ప్రశ్నకు కూడా సమాధానమిచ్చాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు నవ్వుతూ సమాధానమిచ్చే షారుక్..ఆ ప్రశ్న అడిగిన ఫ్యాన్ కు తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. ఇలాంటి క్లాసీ, విద్యావంతులైన ప్రశ్నల కోసం మాత్రమే నేను #asksrk సెషన్ చేస్తానంటూ చమత్కరించాడు షారుక్.
పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!
స్కై బ్లూ డ్రెస్ లో కట్టిపడేస్తున్న సారా..ఫొటోలు వైరల్
లాహే లాహే లిరికల్ వీడియో..చిరు స్టైలిష్ డ్యాన్స్
నవీన్ కోసం స్లిమ్ కానంటున్న అనుష్క..!