Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). బ్యాంకింగ్ సెక్టార్లో జరిగే స్కాం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటించిన ఈ మూవీ అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదలై.. ఫస్ట్ డే నుంచి రికార్డు వసూళ్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
లక్కీ భాస్కర్ ఫైనల్‌గా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. రెండు వారాల్లోపే ఈ ఫీట్ నమోదు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి ఈ స్టామినా ఏంటో చూపించాడు దుల్కర్ సల్మాన్. ఇక ఈ సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతుండగా.. రాబోయే రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరగా మారింది.
నా పేరు భాస్కర్ కుమార్.. నా జీతం ఆరు వేల రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. నా బలం నా భార్య.. అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ.. కాలి గోటి నుంచి తల వరకు ఏది కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించానంటూ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న దుల్కర్ సల్మాన్ సంభాషణలు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేశాయడనంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెరకెక్కించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
Varun Tej | వరుణ్ తేజ్‌కు ఓజీ డైరెక్టర్ సుజిత్ కథ చెప్పాడట.. కానీ
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట