ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది తమిళ సోయగం సమంత (Samantha Akkineni) ). ఎప్పటికపుడు ఏదో ఒక అప్ డేట్‌తో ఫాలోవర్స్ లో నయా జోష్ నింపుతుంది సమంత. ఈ భామ నెట్టింట్లో షేర్ చేసే పోస్టులకు క్రేజ్ మామూలుగా అయితే ఉండదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద ప్రాజెక్టులు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. మరి ఏ స్టార్ హీరోయిన్ కైనా ఇష్టమైన సూపర్ స్టార్ ఒకరుంటారు. మరి అక్కినేని సమంత ఎంతో అమితంగా ప్రేమించే ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరో తెలుసా..? హష్ అక్కినేని (Hash Akkineni). వీళ్లెవరూ అనుకునేరు. అక్కినేని ఫ్యామిలీ మెంబర్ లో ఒకరు. అదేనండి సమంత గారాబంగా పెంచుకునే పెట్ డాగ్.
సమంత పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వాలంటే వెంటనే హష్ దగ్గరకు వచ్చేస్తుంది.కుక్కలు తమ తోకను ఊపుతూ, క్యాట్ వాక్ చేసే ఫన్నీ రీల్ ను షేర్ చేయగా నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సమంత అందరినీ ఆలోచింపజేస్తూ పోస్ట్ పెట్టింది.
చేనేత భారతీయ వారసత్వం. దశాబ్దాల హస్తకళ, చాలా సంక్లిష్టమైన పని. చేనేత కళాకారులు రంగు, చురుకుదనంతో ఈ భూమిని మెరిసేలా చేసేందుకు చేసే వారి కఠోర శ్రమను గుర్తు చేసుకునే సమయమిది అంటూ సందేశాన్ని పోస్ట్ చేసింది.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదుఉన్న సమంత ప్రస్తుతం గుణ శేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తోంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?