Atlee | కోలీవుడ్ స్టా్ర్ డైరెక్టర్ అట్లీ తండ్రయ్యాడు. అట్లీ భార్య ప్రియా మోహన్ తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందాన్ని అట్లీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘అవును వారు చెప్పింది నిజమే. ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం మరెక్కడా లేదు. మాకు మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా’ అంటూ ప్రియాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు.
They were right 😍 There’s no feeling in the world like this ♥️
And just like tat our baby boy is here! A new exciting adventure of parenthood starts today!Grateful. Happy. Blessed. 🤗♥️🙏🏼 @priyaatlee pic.twitter.com/TzvoiFPzyc
— atlee (@Atlee_dir) January 31, 2023
నటి కృష్ణ ప్రియను అట్లీ కుమార్ ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. 2014 వీళ్ల వివాహం జరిగింది. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కావడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు. కాగా గతేడాది డిసెంబర్ లో తన భార్య ప్రియా ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో పంచుకున్నాడు అట్లీ. ఆ టైమ్‌లో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశాడు.
అట్లీ సినీ జీవితం ఏ.ఆర్ మురుగుదాస్ దగ్గర మొదలైంది. మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పనిచేసిన అట్లీ.. ఆయన నిర్మాణ సంస్థలోనే తన మొదటి సినిమాను (రాజారాణి) తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత ఏకంగా విజయ్‌తో థేరీ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. థేరీ తర్వాత అట్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. థేరీ అందించిన ఉత్సాహంతో వరుసగా విజయ్ తో ‘మెర్సల్’, ‘బిగిల్’ సినిమాలకు రూపొందించి తమిళ స్టార్ డైరెక్టర్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా అరంగేట్రం చేస్తున్నాడు. షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 2న రిలీజ్ కానుంది.
ఇక అట్లీ భార్య ప్రియ కూడా పలు తమిళ సినిమాల్లో నటించింది. నా పేరు శివ, ‘యముడు’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయింది.
Tarakaratna | ఐసీయూలో నందమూరి తారకరత్న.. వైరల్ అవుతున్న ఫొటో
RRR | అవార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆర్ఆర్ఆర్.. ఖాతాలో మరో పురస్కారం