Nithiin | నితిన్‌తో వెంకీ కుడుముల అలాంటి ప్రయోగం చేయనున్నాడా?
యంగ్ హీరో నితిన్ సినీ కెరీర్ 'ఇష్క్' ముందు 'ఇష్క్' తర్వాత అన్నట్లు అభిమానులు చెప్పుకుంటుంటారు. ఇష్క్‌కు ముందు నితిన్ వెనకాల ఏకంగా డజన్ ఫ్లాపులున్నాయి. ఆయన స్థానంలో ఏ హీరో ఉన్నా ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయేవారు. కానీ ఆయన మొండితనం, సినిమాపై ఉన్న
Nithiin -Venky Kudumula Movie | యంగ్ హీరో నితిన్ సినీ కెరీర్ ‘ఇష్క్’ ముందు ‘ఇష్క్’ తర్వాత అన్నట్లు అభిమానులు చెప్పుకుంటుంటారు. ఇష్క్‌కు ముందు నితిన్ వెనకాల ఏకంగా డజన్ ఫ్లాపులున్నాయి. ఆయన స్థానంలో ఏ హీరో ఉన్నా ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయేవారు. కానీ ఆయన మొండితనం, సినిమాపై ఉన్న పిచ్చితనం ఇండస్ట్రీని వదల్లేకపోయేలా చేశాయి. ఆ సమయంలో ఇష్క్ విజయం నితిన్‌కు ఊపిరిపోసింది. ఆకలితో ఉన్న మనిషికి గొడ్డు కారం దొరికినా పరమాన్నమే అనిపిస్తుంది. అలాంటిది నితిన్‌కు ఇష్క్‌తో ధమ్ బిర్యానీయే దొరికినట్లయింది. ఏళ్ల తరబడి హిట్టు కోసం ఎదురు చూస్తున్న నితిన్‌కు ఇష్క్ మరిచిపోలేని విజయాన్నిందించింది.
‘ఇష్క్’ తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హర్ట్ ఎటాక్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఆ తర్వాత మళ్లీ రెండు ఫ్లాపులు. ఆ తర్వాత రెండేళ్ళకు ‘అఆ!’ తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసేలోపే మరో మూడు ఫ్లాపులు వెనక్కి వచ్చి చేరాయి. అప్పటి నుండి నితిన్ కెరీర్ ఒక అడుగు ముందుకు పడుతుంటే.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతుంది. అఆ! తర్వాత మళ్లీ నాలుగేళ్లకు ‘భీష్మ’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నితిన్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత మళ్లీ నాలుగు ఫ్లాపులు. ప్రస్తుతం నితిన్, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుమలతో రెండో సారి చేతులు కలుపనున్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిశాయి. కాగా ఈ సారి వెంకీ.. నితిన్ ప్రయోగాత్మక కథను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఒక అరుదైన వ్యాధి వల్ల నెలరోజుల్లో చనిపోతానని తెలిసిన ఒక అబ్బాయి.. ఆ నెల రోజులు తన జీవితాన్ని ఎలా గడిపాడు. తన జీవితానికి దక్కిన ముగింపేంటీ అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం.
ఈ లైన్ వింటుంటే ఇదొక విషాదభరిత కథ అనిపిస్తుంది. కానీ వెంకీ తన స్టైల్ కామెడీతో ఈ సినిమాను రూపొందించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. నిజానికి వెంకీ తన తదుపరి సినిమాను చిరుతో చేయాల్సిఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

