Elephant | ఝార్ఖండ్ (Jharkhand)లో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. వెస్ట్ సింగ్భూమ్ (West Singhbhum) జిల్లాలోని చాయీబాసా అటవీ డివిజన్లో రెండు రోజుల వ్యవధిలోనే ఏనుగు దాడిలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు (Rogue elephant kills 13). మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నోవాముండి, హటగమారియా పోలీసు స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ఈ ఏనుగు వరుస దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు మరణించారు. అంతకు ముందురోజు కొల్హాన్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు సహా ఏడుగురిని ఈ ఏనుగు బలితీసుకుంది. వరుసదాడులతో అప్రమత్తమైన అధికారులు ఏనుగును అడవిలోకి తరిమికొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గత నెల 16వ తేదీ నుంచి ఏనుగు దాడిలో ఈ ప్రాంతంలో 20 మందికిపైగా మరణించినట్లు అధికారులు వివరించారు.
Also Read..
Madhav Gadgil | ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత
Donald Trump | రష్యా చమురుపై ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. భారత్‌పై 500 శాతం సుంకాలు..!
Congress | అంబర్‌నాథ్‌లో 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లపై వేటు.. బీజేపీలో చేరిన కౌన్సిలర్లు