Madhav Gadgil | ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త (Renowned Ecologist), పశ్చిమ కనుమల (Western Ghats) పరిరక్షణ యోధుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాధవ్ గాడ్గిల్ (Madhav Gadgil) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 83 ఏండ్లు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పూణెలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు మాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
కాగా, ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యాన్ని కలిగిన పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు ఆయన ఎనలేని కృషి చేశారు. అభివృద్ధి పేరిట అక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై అలుపెరగని పోరాటం చేశారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికిగానూ 2024 ఏడాదికి సంబంధించి ఐక్యరాజ్యసమితి (ఐరాస) అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్’ ఆయనకు వరించింది. ఇప్పుడు ఆయన మృతితో దేశ పర్యావరణ రంగంలో ఓ శకం ముగిసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Donald Trump | రష్యా చమురుపై ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. భారత్‌పై 500 శాతం సుంకాలు..!
Congress | అంబర్‌నాథ్‌లో 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లపై వేటు.. బీజేపీలో చేరిన కౌన్సిలర్లు
Pakistan | భారత్‌తో యుద్ధం తర్వాత.. మా జెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి : పాక్ మంత్రి