Pakistan | పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది మేలో భారత్‌లో జరిగిని మినీ యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు విపరీతమైన గిరాకీ వచ్చిందని వ్యాఖ్యానించారు. తమ జెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయన్నారు.
కరాచీకి చెందిన జియో టీవీతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2025, మేలో భారత్‌తో జరిగిన నాలుగు రోజుల మినీ యుద్ధం తర్వాత మా దేశ యుద్ధ విమానాలకు డిమాండ్ పెరిగింది. పాక్ (Pakistan) మిలిటరీ సామర్థ్యాలు ప్రపంచం దృష్టిలో పడ్డాయి. రక్షణ ఆర్డర్లు పెరిగాయి. మా జెట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఆరు నెలల తర్వాత మాకు అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణాల అవసరం (IMF loan) కూడా ఉండకపోవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Also Read..
Hybrid paddy | ఔరా అనిపించే హైబ్రిడ్ వరి!.. ప్రపంచంలో వరి ఉత్పత్తి రెట్టింపు అయ్యే అవకాశం