సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి దూరం పెడుతుందని ప్రియుడు( Boyfriend )ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్లో చోటు చేసుకుంది. నిందితుడు యువతి ఇంట్లోకి దూరి సుత్తితో తలపై దాడి చేశాడు. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. నిందితుడు బోయిండ్ల మహేష్..నూతనకల్ మండలం లింగంపల్లి వాసిగా గుర్తించారు తీవ్రంగా గాయపడిన యువతిని హాస్పిటల్లో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రేమించిన యువతి దూరం పెడుతుందని సుత్తితో దాడి చేసిన యువకుడు
సూర్యాపేట జిల్లా స్నేహ నగర్ లో దారుణం
ఇంట్లో దూరి సుత్తితో యువతి తలపై దాడి చేసిన యువకుడు
తీవ్రంగా గాయపడ్డ యువతి.. పరిస్థితి విషమం
నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు pic.twitter.com/n6otn4GQGQ
— Telugu Scribe (@TeluguScribe) February 19, 2026