Nagababu | మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు.. తొందరలోనే వరుణ్ తేజ్ పెళ్లి అంటూ ట్విస్ట్ ఇచ్చిన నాగబాబు
Mega Brother Naga babu | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ ఏడాదిలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉండబోతుంది. ఈ విషయాన్ని స్వయానా మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించాడు.
Nagababu | సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రానా, నితిన్, నిఖిల్, నాగశౌర్య వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. శర్వానంద్ నిశ్చితార్థం కూడా చేసేసుకున్నాడు. ఈ వరుసలోనే ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ ఏడాదిలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉండబోతుంది. ఈ విషయాన్ని స్వయానా మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించాడు.
వరుణ్ తేజ్ పెళ్లిపై కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. మిస్టర్, అంతరిక్షం 9000kmph సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో మెగా ప్రిన్స్ రిలేషన్లో ఉన్నాడని.. తొందరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై అటు వరుణ్ తేజ్.. ఇటు లావణ్య త్రిపాఠి ఇద్దరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్లిపై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు.. తొందరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుందని స్పష్టం చేశాడు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తలపై అడగ్గా.. ఇప్పుడే తానేమీ చెప్పలేనని బదులిచ్చాడు. అయితే తొందరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుందని స్పష్టం చేశాడు. పెళ్లి విషయాన్ని వరుణ్ తేజ్‌నే ప్రకటిస్తాడని తెలిపారు. అమ్మాయి ఎవరనేది కూడా అతనే చెబుతాడని స్పష్టం చేశాడు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ వేరే ఇంట్లో ఉంటాడని.. మేం వేరే ఉంటామని నాగబాబు చెప్పాడు. తన బిడ్డలకు ప్రైవసీ ఇవ్వడం అలవాటు అని.. అందుకే పెళ్లి తర్వాత వేర్వేరు ఇళ్లలో ఉంటామని తెలిపాడు. వేర్వేరు ఇళ్లలో ఉన్నప్పటికీ తమ మధ్య బాండింగ్ మాత్రం ఎప్పుడూ బలంగానే ఉంటుందని స్పష్టం చేశాడు.
వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తొందరలోనే పెళ్లి ఉంటుందని అమ్మాయి వివరాలేవీ చెప్పకపోవడంతో.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే నిజమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లావణ్య త్రిపాఠినే మెగా ఫ్యామిలీకి కాబోయే కొత్త కోడలు అని అనుకుంటున్నారు. మరి ఇది నిజమో కాదో.. వరుణ్ తేజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Read More :
Tarakaratna | ఐసీయూలో నందమూరి తారకరత్న.. వైరల్ అవుతున్న ఫొటో
RRR | అవార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆర్ఆర్ఆర్.. ఖాతాలో మరో పురస్కారం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

