Keerthi Suresh | కీర్తి సురేష్ లవ్ మ్యారేజ్ చేసుకోనుందా.. క్లారిటీ ఇచ్చిన మహానటి తల్లి..!
తొలి సినిమా 'నేను శైలజా'తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిపోయింది మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్. ఇక 'మహానటి'తో ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకుంది. నటనలో ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
Keerthi Suresh Marriage | తొలి సినిమా ‘నేను శైలజా’తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిపోయింది మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్. ఇక ‘మహానటి’తో ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకుంది. నటనలో ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక ఇదిలా ఉంటే గతకొంత కాలంగా కీర్తి లవ్‌లో ఉందని, తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుందని పలు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఓ బిజినెస్ మ్యాన్ అని, కేరళలో అతనికి రిసార్ట్స్ ఉన్నాయని కూడా కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై అలనాటి నటి, కీర్తి సురేశ్ తల్లి మేనక స్పందించింది.
కీర్తిసురేష్ పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవమని, తన కూతురు తరుపున వాటిని ఖండిస్తున్నానని మేనక పేర్కొంది. కాగా మొదట్లో కీర్తిసురేష్, అనురుధ్తో లవ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో కీర్తి, అనిరుధ్‌తో కలిసి పలు పార్టీల్లో కూడా సందడి చేసింది. దాంతో వార్తలు గుప్పుమన్నాయి. అయితే అవన్ని తప్పుడు కథనాలే అని పలు తమిళ మీడియాలో చెప్పాయి. ఆ తర్వాత దళపతి విజయ్‌తో కీర్తి ప్రేమాయణం సాగిస్తుందని జోరుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన తర్వాత విజయ్‌కు, ఆయన సతీమణి సంగీతకు గొడవలు వచ్చాయని కూడా ప్రచారం జరిగింది. కానీ అవన్ని పుకార్లుగానే మిగిలిపోయాయి.
ప్రస్తుతం కీర్తి చేతులో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ ఒకటి. ఈ సినిమాలో కీర్తి డీ గ్లామర్ పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే రిలీజైన కీర్తి పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దీనితో పాటుగా చిరుతో కలిసి ‘భోళాశంకర్’లో నటిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి, చిరుకు చెల్లెలిగా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

