ఎప్పుడూ ఏదో ఒక న్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచే తెలుగు సినిమా ఏదైనా ఉందంటే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు ఆర్ఆర్ఆర్ (RRR). ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చాటి చెప్పింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్.. రీసెంట్గా ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్స్ లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ కూడా చోటు దక్కించుకుంది.
ఎన్నో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అవార్డులను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఇపుడు మరో అవార్డు చేరిపోయింది. పాపులర్ రివ్యూ వెబ్సైట్ Rotten Tomatoes 2022 ఇయర్కుగాను గోల్డెన్ టొమాటో అవార్డ్స్ ను ప్రకటించింది. ఇందులో ఆర్ఆర్ఆర్ Fan Favourite Movie of 2022 అవార్డును గెలుచుకుంది. వెబ్సైట్ ఈ విషయాన్ని అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది.
ఆర్ఆర్ఆర్లో రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించగా.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)జూనియర్ ఎన్టీఆర్ కొమ్రంభీంగా నటించాడు. అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
Our fans voted #RRR as the #GoldenTomato Award winner for Fan Favorite Movie of 2022! https://t.co/gSJnmq1buz pic.twitter.com/tHtk5q4dn4
— Rotten Tomatoes (@RottenTomatoes) January 30, 2023