Raja Saab | డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మారుతి దర్శకత్వంలో హారర్–ఫాంటసీ జానర్లో రూపొందిన ఈ సినిమా, జనవరి 8, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. సినిమా రిలీజ్‌కు ముందే నార్త్ అమెరికా మార్కెట్లో అరుదైన ఘనత సాధించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యేలోపే అక్కడ ఒక మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్ దాటడం విశేషంగా మారింది. ప్రభాస్‌కు విదేశాల్లో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ముందస్తు బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి టాక్ పాజిటివ్‌గా వస్తే, అక్కడ కలెక్షన్లు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ‘ది రాజాసాబ్’కు అనుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా థియేటర్ల సంఖ్య పెరగడం, ప్రైమ్ షో టైమింగ్స్ ఈ సినిమాకు కలిసొచ్చాయని సమాచారం. ఈ అంశాలు కూడా ప్రీమియర్ బుకింగ్స్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ప్రధాన ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటించడం సినిమాకు మరింత వెయిట్ తీసుకొచ్చింది. అలాగే బోమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనుండటం కథపై ఆసక్తిని పెంచుతోంది.
సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రభాస్ కొత్త లుక్, స్టైలింగ్ కూడా అభిమానుల్లో ప్రత్యేక చర్చకు కారణమవుతోంది. హారర్‌తో పాటు వినోదం, మాస్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండేలా కథను రూపొందించినట్లు చిత్ర బృందం చెబుతోంది. ఇటీవల సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు UA 16+ సర్టిఫికెట్ లభించింది. కొన్ని చిన్న మార్పులు సూచించగా, వాటిని వెంటనే పూర్తి చేసి రిలీజ్‌కు సిద్ధమయ్యారు. మొత్తం మీద, భారీ విజువల్స్, ఫాంటసీ టచ్, ప్రభాస్ స్టార్ పవర్ కలిసి ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతి సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే… రిలీజ్ తర్వాత వచ్చే టాక్ ఎలా ఉండబోతోందన్నదని.