Sara Arjun | బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ (Dhurandhar) సృష్టించిన సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఘనవిజయంతో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ (Sara Arjun) ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా అవతరించింది. తాజాగా ఆమె ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన IMDb ట్రెండింగ్ సెలబ్రిటీల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ప్రతి వారం విడుదల చేసే ‘పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్’ జాబితాలో సారా అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ప్రభాస్, విజయ్, అగస్త్య నందా వంటి హేమాహేమీలను సైతం వెనక్కి నెట్టి సారా ఈ ఘనత సాధించడం విశేషం. ‘ధురంధర్’ చిత్రంలో ఆమె పోషించిన ‘యలీనా’ (Yalina) పాత్రకు యూత్ నుండి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. రణ్వీర్ సింగ్‌తో ఆమె కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. కేవలం 33 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1260 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తద్వారా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మరియు యష్ ‘KGF 2’ రికార్డులను అధిగమించి, ఆల్ టైమ్ టాప్-5 ఇండియన్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది.