Terrorist | కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 26 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడి నుంచి కొందరు త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. ఇలా బయటపడిన వారిలో ఓ సెలబ్రిటీ జంట కూడా ఉంది.
ప్రముఖ నటులు దీపిక కక్కర్ (Dipika Kakar)-షోయబ్ ఇబ్రహిమ్ (Shoaib Ibrahim) జంట తమ కుమారుడు రుహాన్‌తో కలిసి కశ్మీర్ ట్రిప్‌కు వెళ్లారు. ట్రిప్‌లో భాగంగా తమ బాబుతో కలిసి లోయలో ఎంతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం అక్కడ ఉగ్రదాడి జరిగిన తర్వాత నెటిజన్లు, అభిమానులు వీరి గురించి ఆందోళన చెందారు. దీంతో షోయబ్ సోషల్ మీడియా వేదికగా తాము క్షేమంగా బయటపడ్డామంటూ ఓ పోస్టు పెట్టారు. దాడి జరగడానికి కొన్ని గంటల ముందే అక్కడి నుంచి బయల్దేరి క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నట్లు వెల్లడించారు. ‘మేం క్షేమంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి బయలుదేరాం. సురక్షితంగా దిల్లీ చేరుకున్నాం. ఎవరూ ఆందోళన పడకండి’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతనాగ్ జిల్లా పెహల్గామ్ పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు.మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీశ్ రంజన్, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.
Also Read..
Pahalgam Terror Attack: సౌదీ నుంచి మధ్యలోనే తిరిగివచ్చిన మోదీ.. కశ్మీర్ దాడిపై ఎన్ఎస్ఏతో మీటింగ్
కశ్మీర్లో ఉగ్రఘాతుకం.. సుమారు 26 మంది పర్యాటకులు మృతి