Pahalgam Terror Attack: సౌదీ నుంచి మధ్యలోనే తిరిగివచ్చిన మోదీ.. కశ్మీర్ దాడిపై ఎన్ఎస్ఏతో మీటింగ్
PM Modi : సౌదీ అరేబియా టూర్ నుంచి మధ్యలోనే ప్రధాని మోదీ హుటాహుటిన ఇండియాకు వచ్చేశారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్న ఆయన పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ఆరా తీశారు. ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్, మంత్రి జయశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి.. టెర్రర్ అటాక్ గురించి బ్రీఫింగ్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రదాడి(Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియడంతో.. సౌదీ అరేబియా టూర్లో ఉన్న ప్రధాని మోదీ హుటాహుటిన ఇండియాకు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే ఆయనకు పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి అధికారులు వివరించారు. ఆ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి ఉగ్రఘాతుకం గురించి వివరించారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని మోదీ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
కశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయినవారిలో మహారాష్ట్ర నుంచి అయిదుగురు ఉన్నారు. అయితే వారి మృతదేహాలను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కోరారు. జమ్మూకశ్మీర్లో చిక్కుకున్న మహారాష్ట్ర టూరిస్టులకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయాలని షిండే కోరారు. అయితే చిక్కుకున్న టూరిస్టుల వివరాలు తెలియగానే విమానం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ప్రపంచ దేశాధినేతలు సంతాపం తెలిపారు. మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో సంభాషించారు. రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంఘీభావాన్ని తెలిపారు.
I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected.
Those behind this heinous act will be brought…
— Narendra Modi (@narendramodi) April 22, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

