Terrorist | కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 26 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవకముందే మరో ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorist) చొరబాటుకు యత్నించారు. అప్రమత్తమైన సైన్యం వారి ప్రయత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టింది. కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టింది.
బుధవారం ఉదయం బారాముల్లా (Baramulla)లోని ఉరి వద్ద ఉన్న సర్జీవన్ ప్రాంతం గుండా సుమారు ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. నియంత్రణరేఖ వద్ద అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నారు. చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం విజయవంతంగా భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ భీకరమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది.
కాగా, కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతనాగ్ జిల్లా పెహల్గామ్ పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు.మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీశ్ రంజన్, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.
Also Read..
Pahalgam Terror Attack: సౌదీ నుంచి మధ్యలోనే తిరిగివచ్చిన మోదీ.. కశ్మీర్ దాడిపై ఎన్ఎస్ఏతో మీటింగ్
Terror Attacks | దేశంలో ప్రధాన ఉగ్రదాడులు ఇవీ..
Telangana IB Officer | పహల్గాం మృతుల్లో తెలంగాణ ఐబీ ఆఫీసర్