Terror Attacks | జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీశ్ రంజన్, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.
ముంబై వరుస పేలుళ్లు
సంవత్సరం: 1993
బాధితులు: 257 మంది మృతి, 1,400 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ
భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి
సంవత్సరం: 2001
బాధితులు: 9 మంది మృతి, 18 మందికి గాయాలు
దాడులు చేసింది: జైషే మొహమ్మద్, లష్కర్-ఏ-తాయిబా
అక్షరధామ్ ఆలయంపై దాడి, గుజరాత్
సంవత్సరం: 2002
బాధితులు: 33 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: లష్కర్-ఎ-తాయిబా
ఢిల్లీ సీరియల్ బాంబు దాడులు
సంవత్సరం: 2005
బాధితులు: 62 మంది మృతి, 210 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: లష్కర్-ఎ-తాయిబా
ముంబై ట్రైన్ బాంబ్ బ్లాస్ట్
సంవత్సరం: 2006
బాధితులు: 209 మంది మృతి, 714 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: లష్కర్-ఎ-తాయిబా, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ఆఫ్ ఇండియా
గోకుల్ చాట్ బ్లాస్ట్, హైదరాబాద్
సంవత్సరం: 2007
బాధితులు: 32 మంది మృతి, 47 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: ఇండియన్ ముజాహిదీన్
లుంబినీ పార్క్ బ్లాస్ట్, హైదరాబాద్
సంవత్సరం: 2007 బాధితులు: 10 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: ఇండియన్ ముజాహిదీన్
ముంబై ఉగ్ర దాడులు
సంవత్సరం: 2008
బాధితులు: 173 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: లష్కర్-ఏ-తాయిబా
దిల్సుఖ్నగర్ బ్లాస్ట్, హైదరాబాద్
సంవత్సరం: 2013
బాధితులు: 17 మంది మృతి, 126 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: ఇండియన్ జాహిదీన్
గడిచిన 11 ఏండ్లలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్ర దాడులు
ఉరి ఎటాక్స్, కశ్మీర్
సంవత్సరం: 2016
బాధితులు: 19 మంది సైనికులకు అమరత్వం, 30 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: జైష్-ఎ-మొహమ్మద్
పుల్వామా దాడి, కశ్మీర్
సంవత్సరం: 2019
బాధితులు: 40 మంది సైనికులకు అమరత్వం, 35 మందికి పైగా గాయాలు
దాడులు చేసింది: జైష్-ఎ-మొహమ్మద్