Sharmeen Akhee | సినిమా సెట్స్‌లో పేలుడు సంభవించడంతో ప్రముఖ బంగ్లా నటి షర్మీన్ అఖీ తీవ్రంగా గాయపడింది. మీర్పూర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో మేకప్ రూంలో పేలుడు సంభవించింది. దీంతో ఆమె కాళ్లు, చేతులు, వెంట్రుకలు సహా ఒళ్లంతా కాలిపోయింది. దీంతో ఆమెను షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం షర్మీన్ అఖీ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
షూటింగ్ సమయంలో గాయపడ్డ షర్మీన్ అఖీ కోలుకుంటున్నట్టుగా ముందు వార్తలు వచ్చాయి. కానీ రక్తంలోని ప్లాస్మా కౌంట్ దారుణంగా పడిపోవడంతో పరిస్థితి మళ్లీ విషమంగా మారింది. ఆమె శరీరం కూడా 35 శాతం కాలిపోయింది. దీంతో ఆమె చికిత్సకు కూడా స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం షర్మీన్ను హై డిపెండెన్సీ యూనిట్ (హెచ్‌డీయూ)కి షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. షర్మీన్ విషయానికొస్తే సిన్సియర్లీ యువర్స్, ఢాకా, బాయిసే స్రాజన్ అండ్ బాందిని వంటి పలు సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
Samantha | చాలా రోజుల తర్వాత సింగర్ చిన్మయిపై సమంత ట్వీట్.. ఆ పుకార్లకు చెక్ పెట్టినట్టేనా?
Vijay Antony | తీవ్రగాయాల నుంచి కోలుకున్న బిచ్చగాడు హీరో.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోనీ
Kadambari Kiran | అంగరంగ వైభవంగా కాదంబరి కిరణ్ కూతురి పెళ్లి.. నెట్టింట ఫొటోలు వైరల్
Samantha | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన సామ్.. ఎందుకంటే?
Dilraju | మరోసారి సంక్రాంతిపై కన్నేసిన దిల్‌రాజు.. ఈ సారైనా వివాదాలు తగ్గుతాయా?