Kadambari Kiran | ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ చిన్న కుమార్తె పూర్ణ సాయిశ్రీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని తారామతి బారాదరిలో బుధవారం ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ ప్రముఖులు శ్రీకాంత్, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, అలీ, బండ్ల గణేశ్, సింగర్ కౌసల్య తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టీవీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన కాదంబరి కిరణ్ సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో జనాలకు రిజిస్టర్ అయ్యాడు. ఆ తర్వాత మహారథి, కెవ్వుకేక, దరువు, ఎక్స్‌ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, గోవిందుడు అందరివాడేలే, రంగస్థలం, భీమ్లా నాయక్, రంగ్ దే, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి చిత్రాలతో మెప్పించాడు.
Samantha | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన సామ్.. ఎందుకంటే?
Dilraju | మరోసారి సంక్రాంతిపై కన్నేసిన దిల్‌రాజు.. ఈ సారైనా వివాదాలు తగ్గుతాయా?