Samantha | చాలా రోజుల తర్వాత సింగర్ చిన్మయిపై సమంత ట్వీట్.. ఆ పుకార్లకు చెక్ పెట్టినట్టేనా?
samantha ruth prabhu | సమంత, చిన్మయి మధ్య వివాదాలు తలెత్తాయని అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇండస్ట్రీలో అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై సమంత ఎప్పుడూ నోరు విప్పలేదు.
Samantha | సమంత, చిన్మయి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్. ఏ మాయ చేశావే సినిమా నుంచి సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెబుతోంది. దీంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అయితే యూటర్న్ సినిమా నుంచి సమంత సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఈ క్రమంలో సమంత, చిన్మయి మధ్య వివాదాలు తలెత్తాయని అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇండస్ట్రీలో అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై సమంత ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఓ ట్వీట్‌తో తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చింది.
మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. చాలారోజులుగా పెండింగ్‌లో ఉన్న సినిమాలను మొదలుపెట్టేసింది. ఇప్పుడు బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో సామ్‌కు స్వాగతం పలుకుతూ హాలీవుడ్ దర్శకద్వయం రస్సో బ్రదర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. దీనిపై నటుడు రాహుల్ రవీంద్రన్ స్పందించారు.
సామ్ ప్రయాణం ఎలా మొదలైందో నాకు ఇంకా గుర్తుంది. సమంతను హాలీవుడ్ ప్రముఖ దర్శకులు రస్సో బ్రదర్స్ తమ ప్రాజెక్టులోకి ఆహ్వానించడం చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ ట్విట్టర్లో రాహుల్ రవీంద్రన్ రాసుకొచ్చాడు. దీనిపై రాహుల్ భార్య సింగర్ చిన్మయి స్పందించింది. సమంత ఓ క్వీన్.. ఇదే అందుకు నిదర్శనమని ప్రశంసిస్తూ కామెంట్ చేసింది.
చిన్మయి ట్వీట్‌పై సమంత కూడా రియాక్ట్ అయ్యింది. నేను కాదు నువ్వే చిన్మయి అంటూ రాసుకొచ్చింది. దానికి కిస్ ఎమోజీని కూడా జత చేసింది. ఈ ట్వీట్‌తో సింగర్ చిన్మయి, సమంత మధ్య విబేధాలు వచ్చాయనే వార్తలు వదంతులేనని తెలిపోయాయి.
Read More :
Vijay Antony | తీవ్రగాయాల నుంచి కోలుకున్న బిచ్చగాడు హీరో.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోనీ
Kadambari Kiran | అంగరంగ వైభవంగా కాదంబరి కిరణ్ కూతురి పెళ్లి.. నెట్టింట ఫొటోలు వైరల్
Samantha | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన సామ్.. ఎందుకంటే?
Dilraju | మరోసారి సంక్రాంతిపై కన్నేసిన దిల్‌రాజు.. ఈ సారైనా వివాదాలు తగ్గుతాయా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

