పేదరికం దాటినా.. బతుకు భారమే!
‘కడుపులో ముళ్లు మొలిచినా ఆకలి బాధంత ఉండదు’ అని రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన హేమా ప్రజాపత్ (25) అంటున్నది.
- దేశంలో 50 కోట్ల మంది కటిక దారిద్య్రం నుంచి బయటపడినట్టు ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక
- కానీ వారి బతుకులు ఇంకా దుర్భరమే
- పెరుగుతున్న ధరలు, అప్పులతో సతమతం
- ఒక్క అనుకోని ఖర్చులు వచ్చినా మళ్లీ దారిద్య్రంలోకే అని అంచనా!
- అల్ జజీరా తాజా నివేదికలో వెల్లడి
రాజ్‌సమంద్: ‘కడుపులో ముళ్లు మొలిచినా ఆకలి బాధంత ఉండదు’ అని రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన హేమా ప్రజాపత్ (25) అంటున్నది. నెలాఖరు వచ్చేసరికి ఆమె ఇంటి వంటగదిలోని అరలు ఖాళీ అవుతున్నాయి. భర్త హరి ప్రజాపత్ అప్పుల్లో మరింత కూరుకుపోతున్నడు. ఇంట్లోని ఆహారంలో ఎక్కువ భాగాన్ని కొడుకు(9) దివ్యాంశ్కే కేటాయించాల్సి వస్తున్నది.
అయితే, అధికారిక లెక్కల్లో హేమ కుటుంబం ఇక పేద కుటుంబం కాదు. ముగ్గురు సభ్యులున్న తన కుటుంబంపై హేమ నెలకు రూ.11,000 ఖర్చు చేస్తున్నది. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన పేదరిక రేఖ ప్రకారం ఇంత కుటుంబానికి నెలకు సుమారు రూ.7,380 ఆదాయం లేదా వ్యయం ఉంటే సరిపోతుంది. హేమ కుటుంబ ఖర్చు ఆ పరిమితికంటే సుమారు 49 శాతం ఎక్కువగా ఉన్నది.
పేదలపై లెక్కలు లేవు
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో పేదల సంఖ్యపై ప్రభుత్వం స్వయంగా లెక్కలు ప్రకటించడం లేదు. వినియోగ వ్యయాల ఆధారంగా అధికారిక పేదరిక అంచనాను పదేండ్లకుపైగా విడుదల చేయలేదు. దీంతో అంతర్జాతీయ పోలికలకు వీలుగా కొత్త వినియోగ సర్వేలు, తన సొంత పేదరిక పరిమితులను ఉపయోగించి ప్రపంచ బ్యాంకే అంచనాలు ఇస్తున్నది. ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2011 నుంచి 2023 మధ్య భారత్ దాదాపు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది.
ఇదే కాలంలో తీవ్ర పేదరికం 27.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది. ఇంత పెద్ద స్థాయిలో పేదరిక నిర్మూలనలో చైనా మాత్రమే పోల్చదగిన ఫలితం సాధించింది. నాలుగు దశాబ్దాల్లో చైనా 80 కోట్లకుపైగా మందిని తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది. భారత్ సాధించిన పురోగతి ముఖ్యమైనదేనని పలువురు ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఈ లెక్కలను గణించే ప్రపంచ బ్యాంకు విధానంపై సందేహాలకు తావులేదని వారు అంటున్నారు. అయితే, పేదరికాన్ని ఓడించామని చెప్పడానికి దేశం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నదని కూడా వారు పేర్కొంటున్నారు.
మోదీ సర్కార్‌పై అనుమానాలు
మరికొందరు ఆర్థికవేత్తలు ప్రపంచ బ్యాంకు విస్తృత నిర్ధారణలను ప్రశ్నిస్తున్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో భారత్ సొంతంగా పేదరిక అంచనాలు వేయడానికి ముందుకు రాకపోవడంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అకడమిక్, రాజకీయ విభేదాల వెనుక మరో వాస్తవం కనిపిస్తున్నది. పేదరిక పరిమితి దాటినట్టు లెక్కల్లో కనిపిస్తున్న లక్షలాది కుటుంబాలు ఇప్పటికీ కొరతల మధ్యనే జీవిస్తున్నాయి.‘ఈ పేదరిక రేఖ చాలా తక్కువగా ఉన్నది. ఈ మొత్తంతో ఎవరూ గౌరవప్రదమైన జీవితం గడపలేరు’ అని చిన్న తోటలో సంరక్షకురాలిగా పనిచేస్తున్న హేమ అల్ జజీరాతో చెప్పింది.
డబ్బు నిలువని బతుకులు
140 కోట్ల జనాభా ఉన్న భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలు ఎదురైనా నామమాత్ర స్థూల దేశీయోత్పత్తి (GDP) పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. అదే సమయంలో ప్రపంచంలో అత్యధిక అసమానతలున్న దేశాల్లోనూ భారత్ ఒకటి.
భారత్‌లో పేదరికం తగ్గడానికి మహిళల శ్రామిక భాగస్వామ్యం పెరగడం కూడా ఒక కారణమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అయితే మహిళలకు స్థిరమైన, తగిన వేతనాల ఉద్యోగాలు అందడం ఇప్పటికీ సవాలుగానే ఉన్నది. అర్థం కావడం లేదు’ అని హేమ చెప్పింది. ‘ఇటీవలి ఏండ్లలో ధరలు ఎన్నో రెట్లు పెరిగాయి. మనం సంపాదించేది ఏ మాత్రం సరిపోవడం లేదు’ అని హేమ తెలిపింది.
ఒక దెబ్బతో మళ్లీ పేదరికంలోకి
ప్రపంచ బ్యాంకు పేదరిక పరిమితిని దాటినట్టు కనిపిస్తున్న లక్షలాది భారత కుటుంబాలు మళ్లీ వెనక్కి నెట్టివేయబడకుండా అంచున బతుకుతున్నవి. న్యూఢిల్లీలో అభివృద్ధి ఆర్థికవేత్తగా పనిచేస్తున్న సంతోష్ మెహ్రోత్రా మాట్లాడుతూ భారత్‌లో పేదరిక పరిమితి చాలా తక్కువగా ఉన్నదన్నారు. మళ్లీ పేదరికంలోకి నెట్టివేయడానికి ‘ఒకే ఒక్క దెబ్బ’ చాలన్నారు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

