యువకుడి లాకప్‌డెత్!
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఓ లాడ్జిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు వరుణ్ (28) ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరుపుతుండగా మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ
- పోలీసుల విచారణలో మృతి !
- ఫిట్స్‌తో చనిపోయాడన్న డీఎస్పీ
- కొట్టడంతోనే చనిపోయాడని
- తల్లి ఆరోపణ.. జడ్చర్లలో ఘటన
- చితకబాదడంతో తన కొడుకు మరణించాడని తల్లి ఆరోపణ
మహబూబ్‌నగర్/జడ్చర్ల టౌన్, నవంబర్ 16: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఓ లాడ్జిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు వరుణ్ (28) ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరుపుతుండగా మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టి, వైద్యుల ప్రాథమిక నివేదిక ఆధారంగా ఫిట్స్ రావడంతోటే చనిపోయినట్టు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఓ లాడ్జిలో పనిచేస్తున్న వరుణ్ ల్యాప్‌టాప్, 30 వేల నగదుతో అదృశ్యమయ్యాడని ఆదివారం లాడ్జి యజమాని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం బాలానగర్‌లోని ఓ లాడ్జిలో వరుణ్‌ను గుర్తించిన లాడ్జి యజమాని జడ్చర్ల పోలీసులకు అప్పగించగా విచారిస్తున్న సమయంలో వరుణ్ మృతిచెందాడు. ఈ ఘటనపై ఎస్పీ జానకి విచారణకు ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతోపాటు పోలీస్ సిబ్బంది, ఇతరులను విచారించారు. సీసీటీవీలో పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు లేదని, కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత అతడిని స్టేషన్లోనే కూర్చోబెట్టారని మీడియాకు వివరించారు. బయటకు వెళ్లిన తర్వాత బెంచ్ మీద కూర్చున్న అతడికి హఠాత్తుగా ఫిట్స్ రావడంతో కిందపడ్డాడని వివరించారు. హుటాహుటిగా పోలీసులు, లాడ్జి యజమాని కలిసి దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. పోలీసుల విచారణలో చనిపోయాడన్నది అవాస్తవమని పేర్కొన్నారు. మృతుడి తల్లి అరుణ మాత్రం పోలీసులు చితకబాదడంతోనే తన కొడుకు మృతి చెందాడని ఆరోపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు డీఎస్పీ వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

