కోట్లు వెచ్చించినా కాలుష్య కాసారమే
యమున నది శుద్ధికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ దాని పరిస్థితి మరింత దిగజారిందని సుప్రీంకోర్టు సోమవారం అధికార యంత్రాంగాన్ని విమర్శించింది.
- యమునా నది కలుషితంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- పరీవాహక రాష్ర్టాలకు జరిమానా విధిస్తామని గట్టి హెచ్చరిక
న్యూఢిల్లీ: యమున నది శుద్ధికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ దాని పరిస్థితి మరింత దిగజారిందని సుప్రీంకోర్టు సోమవారం అధికార యంత్రాంగాన్ని విమర్శించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన బెంచ్ మాట్లాడుతూ, నది ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు, గ్రామాల్లోని పౌర పాలనా వ్యవస్థల వైఫల్యం యమున దుస్థితిని ప్రతిబింబిస్తున్నదని పేర్కొన్నది. ఆ నదిలోకి మురుగు నీటిని వదులుతున్న 520 డ్రెయిన్లను కోర్టు ప్రస్తావించింది.
ప్రధాన డ్రెయిన్లలో, ప్రతి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆ నది నీటి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించింది. ఆ నది తమ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం లేదా జిల్లాల గుండా ప్రవహిస్తున్నప్పుడు నాణ్యత దిగజారితే సంబంధిత అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకొని జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది.
యమున పరివాహక ప్రాంతమంతటా కాలుష్య నియంత్రణ బాధ్యత రాష్ర్టాలదని..ఒక రాష్ట్రం యమునలోకి ఎంత కాలుష్యాన్ని కలుపుతున్నది, దానిని నియంత్రించే సామర్థ్యం దానికి ఎంత ఉన్నది అనే దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

