పెన్షన్ ఫండే 26 కోట్లు.. 100 కోట్ల స్కామ్ ఎట్ల?
నిమ్స్ హాస్పిటల్లో పెన్షన్ ఫండ్ కింద ఉన్న నిధులు కేవలం రూ.26 కోట్లు అయితే రూ.100 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడం తమను విస్మయానికి గురిచేసిందని పారామెడికల్, నర్సింగ్ యూనియన్ల అధ్యక్షురాలు శాంత కుమారి, ఆశాలత వాపోయారు.
- లేఖ రాసిందెవరో కవితనే చెప్పాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావుపై
- ఆమె వ్యాఖ్యలు అర్థంలేనివి
- ఆ యూనియన్లు నిమ్స్‌లో లేనేలేవు
- కవిత వ్యాఖ్యలను ఖండించిన నిమ్స్ యూనియన్లు
ఖైరతాబాద్, నవంబర్ 16 : నిమ్స్ హాస్పిటల్లో పెన్షన్ ఫండ్ కింద ఉన్న నిధులు కేవలం రూ.26 కోట్లు అయితే రూ.100 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడం తమను విస్మయానికి గురిచేసిందని పారామెడికల్, నర్సింగ్ యూనియన్ల అధ్యక్షురాలు శాంత కుమారి, ఆశాలత వాపోయారు. దవాఖాన ప్రాంగణంలో సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోనే పెన్లన్ ప్రక్రియ ప్రారంభం కాగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా సిద్ధంగా ఉన్నా అర్హులకు పింఛన్లు అందకపోవడంపై రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని తెలిపారు. పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కవితకు లేఖ రాసిన వారెవరో ఆమె బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
ఆమె ప్రస్తావిస్తున్న పేరుపై నిమ్స్ హాస్పిటల్లో యూనియన్లే లేవని స్పష్టంచేశారు. సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా కొనసాగడమే కాక ఇటీవల పార్టీ స్థాపించి అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కవిత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వివిధ మార్గాల ద్వారా ఆమె దృష్టికి వచ్చిన అంశాలపై నిమ్స్ యాజమాన్యాన్నిగాని, ఉన్నతాధికారులను గాని నిర్ధారణ చేసుకోకుండా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అవగాహనా లోపంతో చేస్తున్న అనవసరపు వ్యాఖ్యలే తమకు పెన్లన్లు రాకుండా అడ్డుకుంటున్నాయన్న ఆవేదనలో నిమ్స్ పెన్షనర్లు ఉన్నారని తెలిపారు. నిమ్స్ పెన్లన్ వ్యావహారంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు బయటపెట్టాలని, పెన్లనర్ల పేరుతో తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నిమ్స్ ఆసుపత్రి రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పింఛన్లు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని, హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

