జస్టిస్ వినోద్ కుమార్‌కు ఘనంగా వీడోలు
ఉద్యోగ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్ కుమార్‌కు సోమవారం ఫుల్ హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. హైకోర్టు మొదటి హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోషి మాట్లాడుతూ..
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్ కుమార్‌కు సోమవారం ఫుల్ హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. హైకోర్టు మొదటి హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోషి మాట్లాడుతూ.. జస్టిస్ వినోద్ కుమార్ సేవలను కొనియాడారు. బిల్డింగ్ కమిటీ చైర్మన్‌గా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, నల్లగొండ కోర్టు సముదాయం నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. న్యాయసేవల కమిటీ చైర్మన్‌గా ఐదు జాతీయ లోక్ అదాలత్‌లు, ఒక ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని, వీటి ద్వారా 1,380 పెండింగ్ కేసులు, 238 ప్రీ-లిటిగేషన్ కేసులు పరిషారమయ్యాయని చెప్పారు. న్యాయమూర్తిగా 13,213 ప్రధాన కేసులు, 14,033 మిసిలేనియస్ కేసులను పరిషరించారని పేరొన్నారు.
వ్యక్తిగత హకుల పరిరక్షణ, చట్టబద్ధ పాలన, ప్రజాప్రయోజనాల మధ్య సమతుల్యతను పాటిస్తూ జస్టిస్ వినోద్ కుమార్ కీలక తీర్పులు ఇచ్చారని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. అనంతరం జస్టిస్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాదరణ కోసం కాకుండా మనస్సాక్షిగా రాజ్యాంగానికి కట్టుబడి రాగద్వేషాలకు తావులేకుండా తీర్పులు ఇచ్చానని తెలిపారు. కాగా, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ వినోద్ కుమార్‌కు ప్రత్యేక వీడోలు కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సురేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోషి, అసోసియేషన్ కార్యదర్శులు శ్రవణ్ కుమార్‌గౌడ్, కే నిరంజన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డీఎల్ పాండు, సంయుక్త కార్యదర్శి పీ కృష్ణకీర్తన, కోశాధికారి బాలాజీ బానోత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

