సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విల్లులు, గిఫ్ట్ డీడ్స్ వివాదాల్లో సైతం పోలీసులు జోక్యం చేసుకున్నారని పేర్కొంది.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అనుమతినిచ్చే విషయమై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించాలని పేర్కొంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీచేసింది.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాబక్ష్పల్లిలో శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ భూసేకరణకు నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గ్రామాల్లో కోతుల బెడద కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా పంటలను నష్టపర్చకుండా కోతుల నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించాలని సూచించి�