సెలవులో లక్షన్నర మంది ఉద్యోగులు
సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్‌ను పునరుద్ధరించాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన పోరాటం తీవ్రరూపం దా ల్చింది.
- నేడు సీపీఎస్ రణగర్జన
- సామూహిక సెలవులో ఉద్యోగులు, టీచర్లు
- స్తంభించనున్న పాలనా వ్యవస్థ
- ఇందిరాపార్క్‌లో ధర్మ దీక్ష
- జిల్లాల్లోనూ దీక్షలకు సిద్ధం
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్‌ను పునరుద్ధరించాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన పోరాటం తీవ్రరూపం దా ల్చింది. ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ల క్షన్నర మంది ఉద్యోగులు సామూహిక సెలవు లు పెట్టి నిరసన బాటపట్టారు. దీంతో మంగళవారం సెలువు మంజూరు కోరుతూ సోమవారం రాత్రి వరకు సామూహిక సెలవుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది.
టీచర్లతోపాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయ, అటవీశాఖ, పశుసంవర్ధక, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, న్యాయశాఖల ఉద్యోగులు ఈ సామూహిక సెలవు పెట్టారు. సీపీఎస్ రద్దు.. పాత పింఛన్ పునరుద్ధరణకు తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ పి లుపు మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవుల ఉద్యమంలో భాగమయ్యారు.
పాత పింఛన్‌ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ 2023 నవంబర్ 17న తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ మ్యానిఫెస్టో డేను పురస్కరించుకొని, మూ డేండ్ల క్రితం మాట ఇచ్చి తప్పడాన్ని నిరసిస్తూ సీపీఎస్ఈయూ సామూహిక సెలవులు, ధర్మదీక్ష సభలకు పిలుపునిచ్చింది.
ఆఫీసులు ఖాళీ.. బడులకు తాళాలు
రాష్ట్రంలోని ఉద్యోగులంతా సామూహిక సెలవులు పెట్టడంతో మంగళవారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. బడుల్లో పాఠాలు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. రాష్ట్రంలో 3.6 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 50 శాతం మంది సెలవు పెట్టినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
కొంతకాలం క్రితం సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలుపై అధ్యయనానికి కమిటీ వేస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీనిచ్చింది. ఆ హామీ మేరకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉన్నది. కానీ సర్కార్ ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నది.
ఇందిరాపార్కు వద్ద ధర్మ దీక్ష
సర్కార్ తీరును నిరసిస్తూ ఉద్యోగులంతా క్యాజువల్ లీవ్ పెట్టాలని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు నరేందర్‌రావు, మ్యాన పవన్‌కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి ఉద్యోగులంతా ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ధర్మదీక్షకు తరలిరావాలని కోరా రు. జిల్లాల్లో ఎక్కడికక్కడ ధర్మదీక్షల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ధర్మదీక్ష సభకు పీఆర్టీయూ టీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎస్జీటీయూ సైతం మద్దతు తెలిపింది. ఉపాధ్యాయులంతా సెలవు పెట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం పిలుపునిచ్చారు. ఉద్యోగుల సామూహిక సెలవుకు తెలంగాణ గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రౌతు అజయ్ కుమార్, పైళ్ల ప్రకాశ్‌రెడ్డి మద్దతు తెలిపారు.
సామూహిక సెలవుల్లో ఉద్యోగులు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం లో 9 మంది పంచాయతీ కార్యదర్శులు సెలవు పెట్టారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి జడ్పీ హైస్కూల్ టీచర్లు 10మంది సెలవుపై వెళ్లారు.
నల్లగొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో 12మంది ఉద్యోగు లు, సిబ్బంది సెలవు పెట్టారు. కట్టంగూ రు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది 12మంది ఒక రోజు సెలవు పెట్టారు.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఉద్యోగులు, పంచాయతీల కార్యదర్శులు 35మంది సామూహిక సెల వు పెట్టారు. మంచాల మండలంలోని 20 మంది కూడా సెలవుపై వెళ్లారు.
పాత పింఛన్ పునరుద్ధరించాలి: లచ్చిరెడ్డి
సీపీఎస్‌ను రద్దుచేసి.. పాత పింఛన్ పునరుద్ధరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మార్పుపై ఇప్పటికే ప్ర భుత్వం ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపిందని గుర్తుచేశారు. ఇంటర్‌బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేస్తున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది ప్రయోజనాలకు భరోసా కల్పించాలని కోరారు. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

