దుబ్బాకలో మంత్రి వివేక్‌కు నిరసన సెగ
కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి (జిల్లా ఇన్చార్జి మంత్రి) గడ్డం వివేక్‌కు చుక్కెదురైంది.
- చేయూత పింఛన్ పత్రాల పంపిణీలో రసాభాస
- మంత్రి సమక్షంలో సర్పంచుల ఆందోళన, పింఛన్ కోసం చేనేత కార్మికుల నిరసన
దుబ్బాక, నవంబర్16: కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి (జిల్లా ఇన్చార్జి మంత్రి) గడ్డం వివేక్‌కు చుక్కెదురైంది, సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం నగరంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. సభా వేదిక వద్దకు మంత్రి తన వాహనంలో వెళ్తున్న క్రమంలో చేనేతకారులు అడ్డుపడ్డారు. వాహనాన్ని అడ్డుకుని తమకు పింఛన్లు ఎందుకు మంజూరు చేయడంలేదని నిరసనకు దిగారు.
ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుబ్బాకలో 15 వందలకు పైగా చేనేతకారులు చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 11మందికి మాత్రమే మంజూరు కావడంపై వారు ఆందోళనకు దిగా రు. దరఖాస్తు చేసుకున్న చేనేతలందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ఎమ్మెలే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. చేయూత పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగానికి సర్పంచ్‌లు అడ్డుపడ్డారు.
గ్రామాల్లో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. దుబ్బాక నియోజకవర్గంలో పలు గ్రామ పంచాయతీలకు 2023-24లో ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయగా, కాంగ్రెస్ నాయకులు అడ్డుపడి మంజూరు కా కుండా చేశారంటూ సర్పంచ్‌లు ఆరోపించా రు.
ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 1.5 లక్షలు మంజూరు చేస్తే రాజకీయ కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని, ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. బోరుబావులకు నిధులు కోసం మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులు అ డ్డుకోవడంపై సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. దుబ్బాకలో వ్యవహారంపై జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

