పాలమూరు వలసబాట
కృష్ణానది తలాపునే ఉంటది. కానీ సాగునీటి కోసం బీడుబారిన పొలాలు నోళ్లు తెరిచిచూసేవి. పంటలు పండక పాలమూరు కరువు జిల్లాగా మారేది. ఉపాధిని వెతుక్కుంటూ కుటుంబమంతా నగరాలకు బైలెల్లేవి. మహబూబ్నగర్ నుంచి నిత్యం కూలీలను మోసుకుంటూ బస్సులు ముంబైకి చేరేవి. ఖాళీ అయిన ఊళ్లకు, తాళాలు పడిన ఇండ్లకు ముసలీ ముతకా కాపలా ఉండేవాళ్లు. తిండికి లేక అంబలి కేంద్రాల్లో వాళ్లు ఆకలి తీర్చుకునేవాళ్లు!
- కాంగ్రెస్ పాలనలో మళ్లీ పల్లెలను తరుముతున్న కరువు
- పదేండ్లు పల్లెకు భరోసా నేడు ఊరూరా అరిగోస
- పనులు దొరక్క ఊరిడిసిపోతున్న కుటుంబాలు
- పంటలు పండక.. బతుకు భారమై వలసబాట
- మళ్లీ పాలమూరు పల్లెల్లో ఇండ్లకు తాళాలు
- కేసీఆర్ పాలనలో పాలమూరు బిడ్డలు వెనక్కి
- కర్ణాటక, ఏపీ, బెంగాల్ నుంచీ కూలీల రాక
- మళ్లీ సమైక్యపాలన రోజులు తెచ్చిన కాంగ్రెస్
- ఉపాధి వెతుక్కుంటూ పాలమూరు బిడ్డల వలస
- కాంగ్రెస్ పాలనలో.. మళ్లీ బతుకబోతున్న పల్లెలు
- కేసీఆర్ పాలనలో.. పాలమూరుకు ఏపీ కూలీలు
కృష్ణానది తలాపునే ఉంటది. కానీ సాగునీటి కోసం బీడుబారిన పొలాలు నోళ్లు తెరిచిచూసేవి. పంటలు పండక పాలమూరు కరువు జిల్లాగా మారేది. ఉపాధిని వెతుక్కుంటూ కుటుంబమంతా నగరాలకు బైలెల్లేవి. మహబూబ్నగర్ నుంచి నిత్యం కూలీలను మోసుకుంటూ బస్సులు ముంబైకి చేరేవి. ఖాళీ అయిన ఊళ్లకు, తాళాలు పడిన ఇండ్లకు ముసలీ ముతకా కాపలా ఉండేవాళ్లు. తిండికి లేక అంబలి కేంద్రాల్లో వాళ్లు ఆకలి తీర్చుకునేవాళ్లు!
‘పాలమూరు లేబర్’ అనే అమానుష ముద్రను దశాబ్దాల తరబడి నొష్టిన మోసింది తెలంగాణ. ఆ దౌర్భాగ్య స్థితిని మార్చిండు కేసీఆర్. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దశ, దిశ మారింది. పదేండ్లు సాగు బంగారమైంది. పాల మూరు అన్నపూర్ణగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ రాకతో ‘ఆనాటి రోజులు’ తిరిగి వచ్చాయి. పొట్టచేతబట్టుకొని పల్లెలు మళ్లీ వలసబాట పట్టాయి. ఖాళీ ఇండ్లు.. వాటికి తాళాలు.. అన్నిటికి కావలిగా వృద్ధులు కనబడుతున్నరు.
ఒకప్పుడు పల్లెల్లో పచ్చని పంట పొలాలు, వ్యవసాయ పనులతో నిత్యం సందడిగా ఉండే గ్రామీణ ప్రాంతాలు నేడు వెలవెలబోతున్నాయి. రెకల కష్టాన్ని నమ్ముకొని జీవనం సాగించే రైతులు, వ్యవసాయ కూలీలు బతుకుదెరువు కోసం మళ్లీ గ్రామాలను విడిచి వలస బాట పడుతున్నారు. అధికారంలోకి వస్తే మళ్లీ నాటి రోజులు తీసుకొస్తానని గత అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. నాటి రోజులు అంటే ప్రజలకు మెరుగైన ఉపాధి, రైతులకు భరోసా, గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి వస్తుందని ఆశించిన వారికి ప్రస్తుతం ఉపాధి లేక వలసలే ఎదురవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు పంటలు సాగు చేస్తేనే కూలీలకు పనులు దొరుకుతాయి. కానీ వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, వ్యవసాయ పెట్టుబడుల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయ పనులపై ఆధారపడిన కూలీలకు కూడా ఉపాధి దొరుకని పరిస్థితులు నెలకొంటున్నాయని గ్రామీణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
– నారాయణపేట, నవంబర్ 16

ఒకప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకునే ప్రజలు నేడు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. కుటుంబాన్ని పోషించుకోవడానికి స్థానికంగా పని దొరుకక పోవడంతో భార్యాభర్తలు, కొన్ని చోట్ల పిల్లలతో ఇతర నగరాలకు వలస వెళ్తున్నారు. దీంతో గ్రామాల్లోని ఇండ్లకు తాళాలు వేసిన దృశ్యాలు గ్రామీణ జీవన పరిస్థితులపై ఆందోళన కలిగిస్తున్నాయి. నారాయణపేట జిల్లా మద్దూర్, దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ మండలాల్లో వలసలు మొదలయ్యా యి. ముఖ్యంగా నారాయణపేట మండలం కొల్లంపల్లి, అంత్వార్, లక్ష్మీపూర్, పేరపళ్ల తండా, కొల్లంపల్లి తండాలతోపాటు ధన్వాడ మండలం మందిపల్లి, మందిపల్లి తండా, మణిపూర్తండాలో వలసలు ఎక్కువగా ఉన్నా యి. ముఖ్యంగా ముంబై, పుణె, బెంగళూరు, సూరత్, హైదరాబాద్ వంటి నగరాలు వలస కూలీలకు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నా యి. ఆయా ప్రాంతాల్లో నిర్మాణ రంగం, పరిశ్రమలు, హోటళ్లు, ఇతర అసంఘటిత రంగా ల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సొంత ఊరిలో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించాలని ఉన్నప్పటికీ, కడుపు నింపుకోవాలంటే ఊరు విడిచి వెళ్లక తప్పడం లేదని పలువురు కూలీలు వాపోతున్నారు.
కరువుతో కూలీలకు దొరుకని పనులు
వర్షాలు సకాలంలో కురువకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు ఎండిపోవడం, సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో సాగు విస్తీర్ణం తగ్గితే కూలీలకు పనులు కూడా తగ్గిపోతాయి. వ్యవసాయ సీజన్లో కొంతకాలం పని దొరికినా మిగిలిన రోజుల్లో కుటుంబ పోషణ భారంగా మారుతది. రోజువారీ కూలీ పనుల కోసం ఊరూరూ తిరిగినా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవడం కంటే నగరాలకు వెళ్లి కష్టపడటమే మేలని భావిస్తున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
రైతుకు పెట్టుబడి భారం
వ్యవసాయం చేయాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, ట్రాక్టర్ కిరాయిలు ఇలా ప్రతి దశలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి మారెట్లో ఆశించిన ధర లభించకపోతే రైతుకు మిగిలేది అప్పులే. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక, మరోవైపు పంట సాగు చేయడానికి ఆర్థిక స్థోమత లేక రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారు. వ్యవసాయం లాభసాటిగా మారకపోవడం, సాగునీటి సమస్యలు పరిషారం కాకపోవడం, రైతులకు నిరంతర ఆదాయ భరోసా లేకపోవడం వంటి అంశాలు గ్రామీణ కుటుంబాలను ప్రత్యామ్నాయ ఉపాధి వైపు నెట్టుతున్నాయి.

వెలవెలబోతున్న పల్లెలు
ఉపాధి కోసం కుటుంబాలు వలస పోతుండగా పల్లెల్లో జనసంచారం కన్పించడం లేదని స్థానికులు చెప్తున్నారు. కుటుంబ బాధ్యతలు అన్నీ వెనుకబడిన వారిపైనే పడుతున్నాయి. నగరాలకు వెళ్లిన కూలీలు అకడ ఎదురయ్యే అధిక అద్దెలు, జీవన వ్యయాలు, పనిలో భద్రత లేకపోవడం వంటి సమస్యలను కూడా ఎదురొంటున్నారు.
మళ్లీ నాటి రోజులు అంటే వలసలేనా?
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్రెడ్డి చేసిన ‘ఆ నాటి రోజులు తీసుకొస్తాం’ అనే వ్యాఖ్యలను ప్రస్తుత గ్రామీణ పరిస్థితులతో పోల్చుతూ ప్రతిపక్షాలు, విమర్శకులు ప్రశ్నలు సంధించే అవకాశం ఏర్పడింది. ప్రజలు ఆశించినది గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగడం, రైతులు అప్పుల బాధల నుంచి బయటపడటం, వ్యవసాయ కూలీలకు సొంత ఊరిలోనే పని దొరుకడం. కానీ ఇప్పుడు మళ్లీ వలసల చర్చ తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తన్నది.
పల్లెలు బతికితేనే రాష్ట్రం బతుకుతుంది..గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే వ్యవసాయ కూలీకి పని దొరుకుతుంది. కూలీకి పని ఉంటేనే గ్రామాల్లో వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు, వ్యవసాయానికి ప్రోత్సాహం, ఉపాధి హామీ పనులు, చిన్న పరిశ్రమలు, స్థానికంగా ఉపాధి కల్పించే కార్యక్రమాలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోవాలి. వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి తమ స్వగ్రామాలకు వచ్చి జీవించే పరిస్థితులు కల్పించడమే నిజమైన గ్రామీణ అభివృద్ధికి కొలమానం. ఇండ్లకు తాళాలు వేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి కాకుండా, సొంత ఊరిలోనే పనులు చేసుకొని గౌరవంగా బతికే వాతావరణం రావాలని గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు.

నిన్న వలసలు రివర్స్.. ఇప్పుడు సీన్ రివర్స్
సమైక్య పాలనలో వలసలకు మారుపేరైన పాలమూరులో కొత్త చరిత్ర సృష్టించింది కేసీఆర్ పాలన. ఆయన తీసుకున్న చర్యల ఫలితంగా పాలమూరు బిడ్డలు సొంత గ్రామాలకు తిరిగొచ్చారు. సాగు సంబురమైంది. ఇతర రాష్ర్టాలనుంచీ పాలమూరుకు వలసలు మొదలయ్యాయి. 2017లో అమరచింతలో పనుల కోసం వచ్చిన ప్రకాశం జిల్లా కూలీలు
బతుకు ఛిద్రం.. వలస చిత్రం..
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ ఉపాధిని వెతుక్కుంటూ ఊరు విడిచిపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం చెరుకు సీజన్లో పనులు వెతుక్కుంటూ వలసవెళ్లేది. బీఆర్ఎస్ హయాంలో సొంతూర్లోనే చేతినిండా పని దొరికేది. కాంగ్రెస్ రాకతో పరిస్థితి మొదటికొచ్చింది. ఉపాధి కరువై, బతుకు బరువై పల్లెలు మళ్లీ వలసబాట పట్టాయి.
చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోయింది..
నాకు గ్రామంలో ఎకరం 30 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. గతంలో నేను నా కుటుంబంతో కలిసి ముంబైలో ఉండేదాన్ని. సొంత ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించాలనే ఆశతో వరి సాగు చేసేందుకు గ్రామానికి వచ్చిన. ఎంతో ఆశతో అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి వరి వేసిన. పంట బాగా పెరిగి చేతికి వచ్చే సమయంలో నీటి తడులు అందక మొత్తం ఎండిపోయింది. కష్టపడి పండించిన పంట కండ్లముందే ఎండిపోవడం చూసి ఎంతో బాధ కలిగింది. ఇటీవల నా భర్త కూడా మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ నా మీదనే పడ్డాయి. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఒకవైపు, కుటుంబ పోషణ మరోవైపు భారంగా మారాయి. పంట చేతికి వస్తే అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడ్డా. కానీ నీరందక పంట పూర్తిగా దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకుండా పోయింది. ప్రభుత్వం మా లాంటి రైతులను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలి.
– చింతల మణెమ్మ, మందిపల్లి, మం:ధన్వాడ, జిల్లా నారాయణపేట

ఎండిన పంటతో బతుకుదెరువు కరువు..
నాకు ఇద్దరు కొడుకులు. గ్రామంలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో పెద్ద కొడుకు బతుకుదెరువు కోసం ముంబైకి వలస పోయిండు. చిన్న కొడుకుతో కలిసి నేను గ్రామంలోనే ఉంటున్నా. సొంత ఊరిలోనే ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగించాలని ఆశ ఉన్నప్పటికీ, ఇకడ పనులు లభించడం లేదు. కన్న కొడుకు కండ్లముందే ఉండాలని ప్రతి తల్లికీ ఆశ ఉంటుంది. కానీ గ్రామంలో ఉపాధి లేక కొడుకు దూరంగా ఉంటూ కూలీ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెద్ద కొడుకు ముంబైలో కష్టపడి సంపాదించి పంపిస్తున్న డబ్బులతోనే గ్రామంలో మా కుటుంబం జీవనం సాగిస్తున్నది. ఒకప్పుడు వ్యవసాయ పనులతో కళకళలాడిన గ్రామాల్లో నేడు పనులు లేక ప్రజలు వలస బాట పడుతున్నారు.
– చింతలోల్ల నర్సమ్మ, మందిపల్లి, ధన్వాడ మండలం, నారాయణపేట జిల్లా
ఐదు ఎకరాలు ఎండిపోయింది
మాకు గ్రామంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మూడు ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసిన. పంటలు బాగా పండితే కుటుంబానికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని, చేసిన అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడ్డాం. వానలు లేక, నీరందక పంటలు దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోతుండగా, మరోవైపు కుటుంబ అవసరాలు తీరడం కూడా భారంగా మారింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక నా ఇద్దరు కొడుకులు ఉపాధి కోసం పట్టణానికి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– కొండాపూర్ నర్సమ్మ, మందిపల్లి, ధన్వాడ మండలం, నారాయణపేట జిల్లా

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

