బాంచెన్ కాల్మొక్త..ఇల్లు ఇప్పించండి సారూ!
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు గుజ్జునూరి యాకయ్యకు భార్య ముగ్గురు సంతానం ఉన్నారు.
- ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ కాళ్లు మొక్కి వేడుకున్న దివ్యాంగుడు
నర్సింహులపేట, నవంబర్ 16 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు గుజ్జునూరి యాకయ్యకు భార్య ముగ్గురు సంతానం ఉన్నారు. ఎండకు ఎండుతూ వా నకు తడుస్తూ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. మండలకేంద్రంలో సోమవారం పెన్ష న్ మంజూరు పత్రాలు అందించే కార్యక్రమం లో చీఫ్ విప్ రాంచంద్రూనాయక్ పాల్గొన్నా రు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించే సమయంలో దివ్యాంగుడు గుజ్జునూరి యాకయ్య వెళ్లి తనకు పింఛన్ ఇప్పించాలని వేడుకున్నాడు.
‘అయ్యా నేను దివ్యాంగుడిని..20 ఏండ్లుగా గుడిసెలో ఉంటున్నం.. ఎండకు ఎండి.. వానకు తడుస్తున్నం. చలి కాలమైతే గుడిసెలో ఉండలేక పోతున్నం.. కాల్మొక్త బాంచన్ మాకు ఇల్లు ఇప్పించండి’ అంటూ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ కాళ్లు మొక్కాడు. అయినా ఎమ్మెల్యే గుండె కరుగలేదు. యాకయ్యకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ విషయం స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చేందుకు వస్తున్న వారిని నాయకులు అడ్డుకోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

