మీడియాపై అధ్యయనానికి కమిషన్ వేయాలి
మీడియాలో వచ్చిన పెను మా ర్పులు, సోషల్ మీడియా విస్తరణ నేపథ్యం లో మీడియా, జర్నలిస్టులకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసేందుకు మీడియా కమిషన్‌ను ఏర్పాటుచేయాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
- క్రమశిక్షణ గల జర్నలిస్టులకే సమాజంలో గౌరవం
- జాతీయ పత్రికా దినోత్సవంలో వక్తలు
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): మీడియాలో వచ్చిన పెను మా ర్పులు, సోషల్ మీడియా విస్తరణ నేపథ్యం లో మీడియా, జర్నలిస్టులకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసేందుకు మీడియా కమిషన్‌ను ఏర్పాటుచేయాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా దూసుకుపోతున్న తరుణంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు అర్థమయ్యేరీతిలో కచ్చితత్వం, వాస్తవాల ఆధారంగా, వేగంగా వార్తలను అందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
నాంపల్లిలోని తెలంగాణ మీడి యా అకాడమీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్టుల యూనియన్, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహించారు. మీడి యా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో పాత్రికేయుల ప్రమాణాలను కాపాడటానికి, మీడి యా సంస్థలు ఎదురొంటున్న సవాళ్లను పరిషరించడానికి అందరం కలిసికట్టుగా అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రొఫెసర్ కే హరగోపాల్ మాట్లాడుతూ.. దేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించినప్పటి నుంచి అది ఒక స్వతంత్ర సంస్థగా కొనసాగుతున్నదని చెప్పారు.
జర్నలిస్టులు తమ వృత్తిలో ఒక క్రమశిక్షణను అలవర్చుకుని పని చేయాలని, అప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తు తరాలకు అనుగుణంగా మీడియాలో మార్పులు, సమీకరణలు అవసరమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పద్మజ, అమేర్ అలీఖాన్, సీనియర్ జర్నలిస్టులు కే రామచంద్రమూర్తి, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎన్ వేణుగోపాల్, కే సాజయ్య, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కే విరాహత్ అలీ, ప్రధానకార్యదర్శి కే రామ్‌నారాయణ, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

