రేవంత్ పాలనలో ఆదాయం డౌన్.. రూ.500 కోట్ల జీఎస్టీ వసూళ్లకు బ్రేక్
కాంగ్రెస్ ప్రభుత్వ ఏలుబడిలో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు దివాలా దినాలు దాపురించాయి. రేవంత్ సర్కార్ మూడేండ్ల అసమర్థ పాలన, దివాలాకోరు విధానాలతో దాదాపు అన్ని వర్గాలు అల్లాడుతున్నాయి.
- కమర్షియల్ ట్యాక్స్ నివేదికతో రేవంత్ సరార్ గుండెల్లో రైళ్లు
- రాష్ట్ర ఖజానాకు భారీ గండి.. సంక్షేమ పథకాలకు పాతరేనా?
- ఇప్పటికే నిలిచిపోయిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్
- ఇక చేయూత పెన్షన్లకూ గండం!
- కేసీఆర్‌కు పేరు వస్తుందనే అకసుతో ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎత్తిపోయని రేవంత్ సరార్
- ముందుచూపు లేమితో రాష్ట్రానికి ఈ దుస్థితి
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ ఏలుబడిలో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు దివాలా దినాలు దాపురించాయి. రేవంత్ సర్కార్ మూడేండ్ల అసమర్థ పాలన, దివాలాకోరు విధానాలతో దాదాపు అన్ని వర్గాలు అల్లాడుతున్నాయి. సాగునీటి సరఫరా విషయంలో ముందుచూపు లేకపోవడంతో నదుల్లో నీరు అందుబాటులో ఉన్నా పంట పొలాలకు చేరని దుస్థితి నెలకొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్షతో భూములను పడావు పెడుతున్నది. దీంతో రాష్ట్రమంతటా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయం దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. మొత్తంగా ఈ పరిణామాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉరిగా మారుతున్నది. ఆదాయ వనరులను పెంచుకొనే ఉపాయం లేని సర్కార్ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని చూపించి సంక్షేమ పథకాలకు గండికొట్టే స్థితికి దారితీస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుత కరువు పరిస్థితుల నేపథ్యంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర జీఎస్టీ రాబడిలో కనీసం రూ.500 కోట్ల మేర భారీ లోటు ఏర్పడబోతున్నదని కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు తొలి ఏడు నెలల్లో రూ.52,113 కోట్ల భారీ రాబడి, జీఎస్టీలో 17% వృద్ధి రేటు నమోదైనప్పటికీ, కరువును ఎదుర్కొనే విషయంలో రేవంత్ సర్కార్ ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ వేసింది. వాతావరణ ప్రతికూలతల కారణంగా రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి, పత్తి, మిర్చి దిగుబడులు తగ్గడం, ఆ పంటల రవాణా (ట్రాన్స్పోర్ట్), ప్రాసెసింగ్ కార్యకలాపాలు మందగించడమే ఇందుకు ప్రధాన కారణమని తేల్చారు. వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు తగ్గిపోవడంతో ఈ నెల నుంచే పన్నుల వసూళ్లపై ప్రభావం పడుతుందని తద్వారా అనుకున్న స్థాయిలో అదాయం వచ్చే పరిస్థితి లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దాని ప్రభావం జీఎస్టీపైనే కాకుండా అనేక ఇతర కీలక రంగాలపైనా తీవ్రంగా పడుతున్నది. సాధారణంగా పంటలు చేతికొచ్చే ఈ సీజన్లో మారెట్ యార్డులు, రైస్‌మిల్లులు, కాటన్ జిన్నింగ్ కేంద్రాలు, రవాణా రంగాల ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున పన్నుల రూపంలో రాబడి సమకూరేది. కానీ, ఇప్పుడు పంటలు పండక, మారెట్ కదలికలు తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలన్నీ కుదేలైపోయాయి.
సంక్షోభంలో సంక్షేమం
రాష్ట్ర ఆదాయానికి రూ.500 కోట్ల మేర గండి పడటంతో రానున్న రోజుల్లో పేదల సంక్షేమ పథకాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికారిక నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల నుంచి ఆశించిన మేర పన్నులు రాకపోతే బడ్జెట్ కేటాయింపులు తలకిందులై, సంక్షేమ పథకాల అమలుకు నిధుల సర్దుబాటు అత్యంత కష్టతరమవుతుందని కమర్షియల్ ట్యాక్స్ శాఖ హెచ్చరించింది. ముందస్తు ప్రణాళిక లేక ఆర్థిక క్రమశిక్షణ లేమితో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వం, ఈ జీఎస్టీ లోటును సాకుగా చూపి సంక్షేమ పథకాలకు కోత పెట్టే ప్రమాదం పొంచి ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రంలోని లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆశగా ఎదురుచూస్తున్న అన్ని రకాల సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి రానున్న రోజుల్లో తీవ్ర గండం పొంచి ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. నిధుల కొరత ఏర్పడితే, మొదటి దెబ్బ నెలనెలా అందాల్సిన పెన్షన్లపైనే పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పెన్షన్ల పెంపు హామీని తుంగలో తొకిన రేవంత్ సరార్, ఇప్పుడు ఆదాయం పడిపోయిందన్న సాకుతో అసలు పెన్షన్లకే మంగళం పాడుతుందా? అనే అనుమానాలు సైతం లబ్ధిదారులను కలవరపెడుతున్నాయి.
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌కు బ్రేక్
ఇప్పటికే ఆడబిడ్డల పెండ్లికి భరోసానిచ్చే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు నిధుల కొరత రూపంలో పూర్తిగా బ్రేక్ పడే పరిస్థితి నెలకొన్నది. గత కొన్ని నెలలుగా నిధులు విడుదల కాకకపోవడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఏర్పడుతున్న రూ.500 కోట్ల రెవెన్యూ లోటు కారణంగా, ఈ పథకాల విషయంలో సరార్ చేతులెత్తేసే ప్రమాదం పొంచి ఉన్నది. రాష్ట్రంలో ఈ స్థాయిలో కరువు, ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యవసాయ రంగంపై కనీస అవగాహన, ముందుచూపు లేకపోవడమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్ నినో ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా, నీటి నిల్వలను జాగ్రత్తగా మెయింటెన్ చేస్తూ, పంటలను రక్షించుకొనే ప్రయత్నం సరార్ చేయలేదు. పాలనను గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నేడు తెలంగాణ రైతాంగంతోపాటు రాష్ట్ర ఖజానా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది.
లోటు పూడ్చుకోవడానికి సేవా రంగంపై పన్నులు!
తన వైఫల్యాల వల్ల ఏర్పడిన రూ.500 కోట్ల రెవెన్యూ లోటును పూడ్చుకొనేందుకు రేవంత్ సరార్ ఇప్పుడు ఇతర రంగాల ముకుపిండి పన్నులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నది. సేవా రంగం, ఐటీ, రియల్ఎస్టేట్, తయారీ, వాణిజ్య రంగాలపై నిఘా పెంచడంతోపాటు తనిఖీల పేరుతో వ్యాపార వర్గాలను వేధించేందుకు వాణిజ్య పన్నుల శాఖ ప్రణాళికలు రచించిందని అర్థిక రంగ నిపుణలు అభిప్రాయ పడుతున్నారు. పాలనా వైఫల్యంతో వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి వ్యాపారులు, సామాన్యులపై పన్నుల కొరడా ఝుళిపించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే, పదేండ్లపాటు పచ్చని పంటలతో కళకళలాడిన తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో మూడేండ్లు తిరుగకముందే కరువు కాటకాలు, ఆర్థిక సంక్షోభానికి చిరునామాగా మారింది. రాజకీయ కక్షలతో ప్రాజెక్టులను ఎండబెట్టి, నేడు జీఎస్టీ ఆదాయం పడిపోయిందని గగ్గోలు పెట్టడం సరార్ అసమర్థతకు నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉన్నది.
కేసీఆర్‌కు ఎకడ పేరు వస్తుందోనన్న అక్కసుతోనే
కేసీఆర్‌కు ఎకడ పేరు వస్తుందోనన్న సంకుచిత రాజకీయ ఉద్దేశంతోనే, సిద్ధంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి రేవంత్ సరార్ ఒకచుక నీటిని కూడా ఎత్తిపోయకుండా రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టిందన్న ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంపుహౌస్‌లను ఆన్ చేసి, చెరువులు, కుంటలు నింపి ఉంటే నేడు రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చేది కాదు. వ్యవసాయ రంగం కుప్పకూలడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రైతుల చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వ్యాపారాలతోపాటు గ్రామీణ రిటైల్ మారెట్, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. లక్షలాది మంది వ్యవసాయ కూలీలు, హమాలీలు, లారీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డునపడే ప్రమాదం ఏర్పడింది. ఇది భవిష్యత్తులో రాష్ట్ర స్థూల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

