అట్టహాసంగా దీక్షా దివస్ స్ఫూర్తి సభ.. భారీగా నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు
తెలంగాణ సాధన ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న కరీంనగర్ జిల్లా అలుగునూర్ను వేదికగా ఎంచుకొని,
- 29న కేసీఆర్ దీక్షా ప్రాంగణంలో భారీ సభ
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
- కరీంనగర్ పార్లమెంట్ పరిధిపై ప్రత్యేక దృష్టి
- 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ
- ద్యమస్ఫూర్తిని గులాబీ క్యాడర్లో నింపి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధన ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న కరీంనగర్ జిల్లా అలుగునూర్ను వేదికగా ఎంచుకొని, ఈ నెల 29న భారీ స్థాయిలో దీక్షా దివస్ స్ఫూర్తి సభకు సన్నాహాలు చేస్తున్నది. ఈ కార్యక్రమానికి పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభ నిర్వహణపై కరీంనగర్ జిల్లా నేతలు ఇటీవల కేటీఆర్‌తో సమావేశమై కార్యాచరణ రూపొందించారు.
ఉద్యమ చరిత్రను గుర్తుచేసేలా ..
నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. యావత్ తెలంగాణ సమాజం ఏకమై జై తెలంగాణ అని నినదించిన చారిత్రాత్మక ఘట్టాన్ని నేటి తరానికి వివరించాలనే ఉద్దేశంతో అలుగునూరులో ప్రధాన సభతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల వద్ద జెండాలు ఆవిషరించనున్నారు.
ఉద్యమ అనుభవాలు పరిచయం..
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి అనుభవాలను యువతకు తెలియజేసేలా ఫొటోలు, వీడియోల ప్రదర్శనలు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాయి. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర సాధనలో వివిధ వర్గాల పాత్రను యువతకు వివరించనున్నారు.
కరీంనగర్ పార్లమెంట్‌పై ప్రత్యేక దృష్టి
దీక్షా దివస్ సభ ద్వారా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీ శక్తిని చాటాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. వీటితోపాటు పెద్దపల్లి ప్రాంతంపైనా ప్రత్యేకంగా దృష్టి పెడ్తున్నది. కరీంనగర్ పరిధిలో పార్టీకి ఉన్న సంస్థాగత బలాన్ని సమీకరించి, క్యాడర్లో ఐక్యతను పెంచాలని చూస్తున్నది. పార్టీ శ్రేణులను కార్యాచరణకు సిద్ధం చేయడంపైనా దృష్టి పెట్టింది.
ఆస్ట్రేలియాలో దీక్షా దివస్ : నాగేందర్
రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు గుర్తుగా నిర్వహించే దీక్షా దివస్‌ను ఆస్ట్రేలియాలో ఈ నెల 29న ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ తెలిపారు. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా, అడిలైడ్, పెర్త్, జీలాంగ్, బల్లారట్, కైర్న్స్తో పాటు టాస్మానియాలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రవాసీ తెలంగాణ వాసులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దక్షిణాఫ్రికాలో 14రోజుల కార్యక్రమాలు
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకుడు మహేష్ బిగాల ఆదేశాల మేరకు దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో 14 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దక్షిణాఫ్రికాశాఖ నాయకుడు నాగరాజు గుర్రాల తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్‌కు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని పేరొన్నారు. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రపై ప్రత్యేక వీడియో సందేశాలు, కేసీఆర్ దీక్ష, రాష్ట్ర సాధనకు సంబంధించిన చారిత్రక ఘట్టాల ప్రచారం, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, ప్రజల పాత్రపై అవగాహన కార్యక్రమాలు, అమరవీరులకు నివాళులు, సోషల్ మీడియా ద్వారా దీక్షా దివస్ ప్రచారం, భావితరాలకు తెలంగాణ ఉద్యమ చరిత్రను పరిచయం చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులందరూ భాగస్వాములు కావాలని నాగరాజు గుర్రాల పిలుపునిచ్చారు.
క్యాడర్లో నూతనోత్సాహం నింపేలా..
రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు కరీంనగర్ రాజకీయంగా కీలక ప్రాంతం. గతంలో పార్టీకి బలమైన పునాదులున్న ఈ ప్రాంతంలో మరోసారి శ్రేణులను క్రియాశీలం చేయడం నాయకత్వానికి ప్రాధాన్యంగా మారింది. ఈ నేపథ్యంలో అలుగునూరు సభను పార్టీ బలప్రదర్శనకు, క్యాడర్ ఐక్యతకు వేదికగా మలుచుకోవాలని భావిస్తున్నది. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జులు, సీనియర్ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాలు, అనుబంధ సంఘాలను సమన్వయం చేస్తున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్కు రాజకీయంగా కీలక కేంద్రంగా ఉన్న నేపథ్యంలో సభను భారీ స్థాయిలో నిర్వహించి, ఉద్యమ వారసత్వంతోపాటు పార్టీ ఐక్యతను చాటాలని నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

