Vijay Antony | తీవ్రగాయాల నుంచి కోలుకున్న బిచ్చగాడు హీరో.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోనీ
Vijay Antony | కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వచ్చింది. మలేసియాలో జరిగిన బిచ్చగాడు 2 షూటింగ్లో తీవ్రంగా గాయపడిన విజయ్ ఆంటోనీ దాదాపు కోలుకున్నాడు. 90 శాతం రికవరీ అయ్యాడు.
Vijay Antony | కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వచ్చింది. మలేసియాలో జరిగిన బిచ్చగాడు 2 షూటింగ్లో తీవ్రంగా గాయపడిన విజయ్ ఆంటోనీ దాదాపు కోలుకున్నాడు. 90 శాతం రికవరీ అయ్యాడు. ఈ విషయాన్ని విజయ్ ఆంటోనీ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
2016లో వచ్చిన బిచ్చగాడు ( పిచ్చైకారన్ ) సినిమాకు ఇప్పుడు విజయ్ ఆంటోనీ సీక్వెల్ తీస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ దర్శకుడిగా కూడా మారుతున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ కోసం ఇటీవల చిత్ర బృందం మలేసియాకు వెళ్లింది. అక్కడ సముద్రంలో షూటింగ్ చేస్తున్న సమయంలో అతను ఉన్న బోటు.. చిత్ర బృందం ఉన్న మరో బోటును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలయ్యాయి. ముఖానికి దెబ్బలు తగలడంతో పళ్లు, దవడ ఎముకలు విరిగిపోయాయి. దీంతో ఆయన్ను కౌలాలంపూర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి చెన్నై తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంపై చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ తాను కోలుకున్నట్టు ప్రకటించాడు.
அன்பு இதயங்களே
நான் 90% குணம் அடைந்து விட்டேன்.
உடைந்த என் தாடை, மூக்கு எலும்புகள் ஒன்று சேர்ந்துவிட்டன.
என்னமோ தெரியவில்லை, நான் இப்போது முன்பைவிட அதிக சந்தோஷத்தை உங்களால் உணருகிறேன்😊
வரும் ஏப்ரல் வெளியாகும் பிச்சைக்காரன் 2 பட வேலைகளை இன்று முதல் தொடங்குகிறேன்🙏
அன்புக்கு நன்றி— vijayantony (@vijayantony) February 2, 2023
యాక్సిడెంట్లో తన దవడ, ముక్కు ఎముకలు విరిగిపోయాయని.. ఆసమయంలో ఏం జరిగిందనేది కూడా తనకు తెలియదని విజయ్ ఆంటోనీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పుడు 90 శాతం వరకు కోలుకున్నానని తెలియజేశాడు. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్ల ఇంతకుముందు కంటే కూడా చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. దీంతో పాటు బిచ్చగాడు 2 సినిమాపై కూడా అప్డేట్ ఇచ్చాడు. ఇవాల్టి నుంచి షూటింగ్ కూడా మొదలుపెట్టామని అప్డేట్ ఇచ్చాడు. బిచ్చగాడు సినిమాను ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
Read More :
Kadambari Kiran | అంగరంగ వైభవంగా కాదంబరి కిరణ్ కూతురి పెళ్లి.. నెట్టింట ఫొటోలు వైరల్
Samantha | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్పిన సామ్.. ఎందుకంటే?
Dilraju | మరోసారి సంక్రాంతిపై కన్నేసిన దిల్రాజు.. ఈ సారైనా వివాదాలు తగ్గుతాయా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

