పథ్యం చేయాలా? వద్దా?
అమర కోశం ప్రకారం.. పథ్యం అంటే హితకరమైనది. మనకు అనుకూలమైనది. అపథ్యం అంటే అహితకరమైనది. అనుకూలమైన పథ్యాలు, అనుకూలం కాని పథ్యాలు అన్నీ వైద్యశాస్త్రంలో ఉంటాయి. మధుమేహ రోగులకు పిండి పదార్థాలు, మధుర పదార్థాలు, తియ్యని పానీయాలు అపథ్యం అని ఆయుర్వేదం చెప్పింది. తీయని పదార్థాలు ఎకువగా తీసుకోవడం అనేది మధుమేహానికి కారణమని కూడా చెప్పారు. ఇప్పటి వైద్యం ఇంతకుమించి ఏం చెప్పలేదు.
అమర కోశం ప్రకారం.. పథ్యం అంటే హితకరమైనది. మనకు అనుకూలమైనది. అపథ్యం అంటే అహితకరమైనది. అనుకూలమైన పథ్యాలు, అనుకూలం కాని పథ్యాలు అన్నీ వైద్యశాస్త్రంలో ఉంటాయి. మధుమేహ రోగులకు పిండి పదార్థాలు, మధుర పదార్థాలు, తియ్యని పానీయాలు అపథ్యం అని ఆయుర్వేదం చెప్పింది. తీయని పదార్థాలు ఎకువగా తీసుకోవడం అనేది మధుమేహానికి కారణమని కూడా చెప్పారు. ఇప్పటి వైద్యం ఇంతకుమించి ఏం చెప్పలేదు.
పత్యే సతి గదార్దస్య కిమౌషదం నిసేవనః
పత్యే అసతి గదార్దస్య కిమౌషదం నిసేవనః
లోలాంబరాజు రచించిన వైద్య జీవనం అనే గ్రంథంలో పథ్యం గురించి ఎంతో ఆధునికంగా వివరించారు. హెల్త్ కేర్ రంగంలో ఆహారం, జీవనశైలి, ప్రాముఖ్యత గురించి చాలా అద్భుతంగా చెప్పారు. దినచర్యలో భాగంగా శరీర ధర్మాన్ని బట్టి, రుతువులను అనుసరించి గట్ హెల్త్‌ని ఇబ్బంది పెట్టకుండా ఆహారాన్ని తీసుకుంటే ఔషధాల అవసరం ఏముంటుంది? సమతుల ఆహారం తీసుకోకపోతే ఎన్ని మందులు వాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
నాటు వైద్యాలు, ట్రైబల్ వైద్యాలు, గచ్చాకు-పిచ్చాకు వైద్యాలతో ప్రాక్టీస్ చేసేవారు నిరంతరం చెప్పేదొకటే. గొడ్డుకారంతో అన్నం తినండి, దుంపలు తినకండి, వంకాయ తినకండి, పచ్చళ్లు తినకండి, ఒట్టి చేపలు తినకండి, గుమ్మడికాయ తినకండి.. అంటూ పథ్యం పేరుతో తినకూడని అంశాలు చెబుతూ ఉంటారు. చేయాల్సిన పనుల కింద చేయకూడని పనుల గురించి చెబుతారు. కొంతమంది ఆయుర్వేద వైద్యులు కూడా ఇలాగే చెప్పడం మొదలుపెట్టారు. దీనికి తోడు ఇంగ్లిష్ వైద్యుల దుష్ప్రచారం, ప్రతిఘటించే వాళ్లు లేకపోవడం ఇతరత్రా కారణాలవల్ల ఆయుర్వేదంలో పథ్యం ఓ బ్రహ్మ పదార్థంలా మారింది.
పథ్యం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని లోతుగా అర్థం చేసుకోవడం అవసరం. ‘అడిగేవాడికి చెప్పేవాడు లోకువ’ అన్నట్లు.. అపోహలు పెట్టుకునే వారు కూడా తమ చుట్టూ ఆయుర్వేదం వాడిన వాళ్ల అనుభవాలు సేకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ తెలుసుకోకుండా కేవలం ఒక వైద్యశాస్త్రం చెప్పిందే వేదమని నమ్మడం వల్ల, నిజమైన ఆయుర్వేద అభివృద్ధిని దూరం చేసుకోవడం వల్ల ప్రజలే నష్టపోతారు.
ఆయుర్వేద చికిత్సతో కీళ్ల వాతం, కీళ్లు గట్టిపడి చేతులు ఎత్తలేక పోవడం, ఆర్థరైటిస్, లివర్ జబ్బులు, వెన్ను నొప్పి సమస్యలు, క్లోమ గ్రంథి పైన వాపు తదితర రుగ్మతలు చాలా బాగా తగ్గుతున్నాయి. అనేక కారణాల వల్ల దెబ్బతిన్న జీవశక్తి.. ఆయుర్వేదంతో కరెక్ట్ అవుతుంది. గట్ హెల్త్ గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. లివర్ పనితీరు మెరుగవుతుంది. మందులు అవసరం లేకుండా గ్యాస్, ఎసిడిటీ తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. శరీరం తేలికపడి ఆరోగ్యకరమైన నడక మొదలవుతుంది. చాలా ఆయుర్వేద ఔషధాలలో గుగ్గులు ఉండటం వల్ల రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. ఎలాంటి ఎక్స్ట్రా డైటింగ్ అవసరం లేకుండానే శరీర బరువు తగ్గుతారు.
పూర్వం వైద్యులు చికిత్సలో భాగంగా పథ్యం కూరలు తీసుకోమని చెప్పేవారు. నీరు నిండిన కాయగూరలు సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దొండ, బెండ, తెల్ల గుమ్మడి, గోరుచికుడు, లేత బీన్స్, మునకాడలు, కాకర లాంటివి తినాలని సూచించేవారు. పులుపు, కారం, మసాలాలు, తగ్గించమని చెప్పేవారు. పెరుగు బదులు మజ్జిగ, పప్పు కట్టు, ఉడకబెట్టిన గుడ్లు, మాంసాహారంలో చేపలు తినాలనేవారు. ఇలాంటి పథ్యం అల్లోపతి వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఎలా వచ్చి చేరిందో కానీ, ఒక భావజాలం ఆయుర్వేదాన్ని అల్లిబిల్లిగా అల్లుకుంది. అవి తొలగిస్తే నిజమైన ఆయుర్వేదం వెలుగులోకి వస్తుంది. కుశ్రుతం కుపరీక్షితం లాగా ఏది పరీక్షించకుండా, ఏదీ చూడకుండా, ఏది సరిగ్గా అర్థం చేసుకోకుండా, గుడ్డిగా నమ్మకూడదని పంచతంత్రం చెబుతుంది. రోగం ముదిరిన తర్వాత ఆయుర్వేదాన్ని ఎంచుకునే కంటే.. ముందస్తుగానే ఈ వైద్యాన్ని ఆశ్రయిస్తే మనకు ఎంతో మేలు జరుగుతుంది.
డాక్టర్ బుక్కా మహేశ్‌బాబు
ఆయుర్వేద వైద్య నిపుణులు
70328 03085
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

