Trump: ఆ మీడియా ప్రతినిధులపై బ్యాన్ ఎత్తివేయండి.. ట్రంప్ సర్కారుకు ఫెడరల్ కోర్టు ఆదేశం
Trump : సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలపై ట్రంప్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మీడియా సంస్థ ప్రతినిధులకు శ్వేతసౌధంలోకి ఎంట్రీ అవకాశాన్ని కల్పించాలని ఫెడరల జడ్జీ ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక బ్యాన్ ఎత్తివేయాలని జడ్జీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Trump)కు మరో జలక్ తగిలింది. సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలపై ట్రంప్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. శ్వేతసౌధంలో రిపోర్టింగ్ కోసం ఆంక్షలు విధిస్తూ ఆ మీడియా సంస్థ ప్రతినిధులను బ్యాన్ చేశారు. అయితే ఫెడరల్ జడ్జి తిమోతీ కెల్లీ ఆ కేసులో ఆదేశాలు ఇస్తూ.. మూడు మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులకు మళ్లీ వైట్‌హౌజ్ ఎంట్రీ కల్పించాలన్నారు. తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలని, వారికి వైట్‌హౌజ్ ఎంట్రీ అవకాశం కల్పించాలని తిమోతీ తన ఆదేశంలో పేర్కొన్నారు.
ఆ మూడు సంస్థలకు చెందిన రిపోర్టర్ల గుర్తింపును రద్దు చేసినట్లు ట్రంప్ లాయర్లు తెలిపారు. జాతీయ భద్రతకు ముప్పు నెలకొన్న నేపథ్యంలో వారిని బ్యాన్ చేస్తున్నట్లు ట్రంప్ సర్కారు పేర్కొన్న విషయం తెలిసిందే. సీఎన్ఎన్, పొలిటికో, ఎంఎస్ నౌ సంస్థలు ఫేక్ న్యూస్ ఏజెన్సీలు అని ట్రంప్ గతంలోనూ ఆరోపించారు. నెగటివ్ కవరేజీ దేశానికి ప్రమాదం అని కూడా ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ట్రంప్ విధానాలను తప్పుపట్టడం వల్లే తమను బ్యాన్ చేసినట్లు ఆ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

