బాలీవుడ్ (Bollywood)లో రిలేషన్షిప్లో ఉన్న సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కడం కొత్తేమి కాదు. ఈ ఏడాది నవంబర్ 15న బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ వివాహబంధంతో ఒక్కటయ్యారు. మరోవైపు విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నారని, డిసెంబర్లో రాజస్థాన్‌లోని పోర్టు రిసార్ట్స్ లో వీరి పెళ్లివేడుకకు ఏర్పాట్లు సాగుతున్నాయని బీటౌన్ వర్గాల సమాచారం. మరోవైపు స్టార్ యాక్టర్లు రణ్‌బీర్ కపూర్, అలియాభట్ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నారు.
అయితే ఇపుడు మరో బాలీవుడ్ తార బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతుందన్న వార్త బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ భామ ఎవరనే కదా మీ డౌటు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, మర్ జవాన్ చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన తారా సుటారియా (Tara Sutaria). ఇంతకీ ఈ బ్యూటీ మనువాడబోయేది ఎవరో తెలుసా..? రణ్ బీర్ కపూర్ కజిన్, యాక్టర్ ఆదార్ జైన్ (Aadar Jain). అలియా-రణ్ బీర్ పెళ్లి కంటే ముందు వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారట.
తారా సుటారియా ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ తడప్ చిత్రంతోపాటు హీరోపంతి 2, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తోంది. రణ్‌బీర్-అలియా వివాహం వచ్చే ఏడాది సమ్మర్లో జరుగునున్నట్టు టాక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?