టాలీవుడ్ నటుడు, జనసేన (Jana Sena party) అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తల్లి అంజనమ్మ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. 2014లో జనసేన పార్టీకి రూ.4 లక్షలు విరాళం ప్రకటించి..వార్తల్లో నిలిచారు అంజనమ్మ (Anjanamma). ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల (AP farmers) కోసం తన వంతు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఏపీ రైతుల సంక్షేమానికి రూ.1.5 లక్షలు విరాళం ప్రకటించారు.
తన కుమారుడు పవన్ కల్యాణ్‌కు అంజనమ్మ చెక్కు అందజేస్తున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంజనమ్మ దీంతోపాటు అదనంగా మరో లక్ష రూపాయలు పార్టీకి విరాళం అందించారు. గొప్ప మనసుతో రైతుల కోసం విరాళం అందించిన అంజనమ్మకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో అన్నదాతలకు అండగా నిలిచేందుకు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు పవన్ కల్యాణ్.
ఏపీలో చనిపోయిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే కాదు..తన వంతుగా సంక్షేమ నిధికి రూ.5 కోట్లు కూడా ప్రకటించారు. మిగిలిన మొత్తాన్ని పార్టీ నేతలు ఇస్తారని ప్రకటించారు. అక్టోబర్ నుంచి ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర కూడా చేపట్టనున్నారు పవన్‌కల్యాణ్.
జనసేన కౌలు రైతు భరోసాకు అమ్మ సాయం
Video Link: https://t.co/4S7pyEtTLD pic.twitter.com/477BID53lj
— JanaSena Party (@JanaSenaParty) June 25, 2022