తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా కథాంశంతో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు పార్టులుగా రానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
పుష్ప లో మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ సాంగ్ లో ఒకటి రీమిక్స్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.ఇప్పటివరకు అల్లు అర్జున్ చిరంజీవి పాటను రీమిక్స్ చేయలేదు. పుష్పలో సిచ్యుయేషన్ కు తగ్గట్టుగా ఈ సాంగ్ ను కంపోజ్ చేయనున్నారట. దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.
అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక సమాచారం లేకున్నా..న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!