అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున సినిమా పుష్ప. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. దాంతో ఎక్కడా రిస్క్ తీసుకోకుండా పుష్ప సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అవుతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఏకంగా ఆరు నెలల పాటు ఈ సినిమాను వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ లో కానీ లేదంటే 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తుంది.దానికి కారణం షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం. హడావిడిగా పూర్తిచేసి..అనవసరంగా క్వాలిటీ లేని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే కంటే కూడా కావాల్సినంత టైమ్ తీసుకుని అద్భుతమైన ప్రాజెక్ట్ విడుదల చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు.
అందుకే పుష్ప సినిమా ఆరు నెలలు ఆలస్యంగా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై దర్శక నిర్మాతలు కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తమ సినిమా ఇప్పుడు విడుదల చేయకపోవడమే మంచిది అని వాళ్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆలస్యం వెనక మరో కథ కూడా ఉంది. అల్లు అర్జున్ తర్వాత సినిమా కొరటాల శివతో చేయాల్సి ఉంది.
కానీ ఈయన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. మరోవైపు తారక్ చేయాల్సిన త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తర్వాత సినిమా ఉండబోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ విషయంపై క్లారిటీగా మాట్లాడుకున్నారు. అందుకే కంగారు లేకుండా సుకుమార్ సినిమా పూర్తి చేస్తున్నాడు బన్నీ. ఎన్టీఆర్ సినిమా అయిన తర్వాత కొరటాల, బన్నీ సినిమా మొదలు కానుంది.
ఇవి కూడా చదవండి
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్