మునుగోడు, ఏప్రిల్ 27 : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మునుగోడు మండల కేంద్రంలో సోమవారం ఆ పార్టీ మండలాధ్యక్షుడు మందుల సత్యం అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఈ సందర్భంగా మందుల సత్యం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నన్నూరి భూపతి రెడ్డి, గజ్జెల బాలరాజు గౌడ్, పొలగొని సైదులు గౌడ్, మారగోని అంజయ్య గౌడ్, పగిళ్ల సతీష్, యడవల్లి సురేష్ కుమార్, ఎల్లంకి యాదగిరి, అద్దంకి జగన్, గురుపాదం, దోటీ కరుణాకర్, నందిపాటి వెంకన్న, జిట్టగోని సైదులు, పందుల అంజి, గుర్రాల సురేష్, కట్కూరి శ్రీను, గాలి సైదులు, బండారు శ్రీనివాస్, జిట్టగోని మల్లేష్ యాదవ్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.